Breaking News

నీతో పరిచయానికి ఏడేళ్లు.. ఆ బంధాన్ని గుర్తు చేసుకున్న హీరోయిన్ మాజీ ప్రియుడు!

Published on Mon, 07/28/2025 - 18:20

బాలీవుడ్ నటి, ప్రపంచసుందరి సుస్మితాన్ సేన్‌ పేరు అందరికీ సుపరిచితమే. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. చాలా ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సుస్మితా ఆర్య అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఆ తర్వాత  తాలి ‍అనే వెబ్ సిరీస్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ అయిన సుస్మితా సేన్‌.. వ్యక్తిగత జీవితంలో మాత్రం విఫలమైంది. చాలామందితో డేటింగ్‌ చేసిన ఆమె.. ఎవరినీ కూడా తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో లవ్‌లో పడ్డప్పటికీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేకపోయింది. ఆ తర్వాత మోడల్‌ రోహ్మన్‌ షాతో ప్రేమలో పడింది. కానీ వీరిద్దరు ప్రేమ మూడేళ్లు కూడా నిలవలేదు. 2018లో మొదలైన వీరి పరిచయం మూడేళ్లకే బ్రేకప్ అయింది. అయినప్పటికీ వీరిద్దరు ఫ్రెండ్స్‌గానే కొనసాగుతున్నారు.

ఈ సందర్భంగా మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్‌ తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేటికి మన పరిచయానికి ఏడేళ్లు అంటూ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. సుస్మితా సేన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. జీవితంలో అనే విషయాలను నీ వద్ద నేర్చుకున్నానని పోస్ట్‌లో రాసుకొచ్చారు. నీతో పరిచయం తర్వాత నా జీవితం చాలా మారిపోయిందని ఇన్‌స్టాలో పంచుకున్నారు.

రోహ్మన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మన స్నేహానికి నేటికి 7 సంవత్సరాలు. కొన్ని కథలు వాటి శీర్షికలను మించిపోతాయి. కానీ వాటి అర్థం ఉండదు. నేను మీకు చెస్ నేర్పించాను. కానీ మీరు నన్ను కనికరం లేకుండా ఓడించారు. మీరు నాకు ఈత నేర్పించారు. నా లైఫ్‌లో బెస్ట్‌   హెయిర్ కట్స్ చేసినందుకు నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను. మేము మా పాత్రలు, భయాలు, బలాలను కూడా మార్చుకున్నాం. నీ ప్రేమకు, నీ నిశ్శబ్ద స్నేహానికి కృతజ్ఞతలు సుస్మితా సేన్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుష్మితా సేన్‌తో ఉన్న ఫోటోలు ఇద్దరు ఒకే జాకెట్ ధరించి కనిపించారు.
 

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)