Breaking News

బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?

Published on Sun, 12/08/2024 - 08:11

బిగ్‌బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో షో ముగిసిపోనున్న దృష్ట్యా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇందులో భాగంగా రోహిణిని శనివారం బయటకు పంపేశారు. ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ మంచి గుర్తింపుతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇంతకీ రోహిణి ఎన్ని వారాలు ఉంది? ఎన్ని లక్షలు సంపాదించింది?

వచ్చేవారమంతా ఫినాలే వీక్ కాబట్టి.. టాప్-5ని మాత్రమే పంపించాలి కాబట్టి ఇప్పుడు రోహిణిని పంపించారు. ఆదివారం ఎపిసోడ్‌లో విష్ణుప్రియని ఎలిమినేట్ చేయబోతున్నారు. కాసేపు విష్ణుప్రియ గురించి పక్కనబెడితే రోహిణి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. అప్పటివరకు నీరసంగా ఉన్న షోని కాస్త అవినాష్‌తో కలిసి ఎంటర్‌టైన్ చేస్తూ కాస్త రేటింగ్స్ వచ్చేలా చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ')

రోహిణిని అయితే పృథ్వీ, విష్ణుప్రియ లాంటి వాళ్లు అసలు నువ్వు కామెడీ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరావ్ అని నానా మాటలు అన్నారు. దీంతో తను కేవలం కామెడీకి మాత్రమే కాదని, గేమ్స్ కూడా ఆడగలనని నిరూపించింది. తనని మాటలన్నా పృథ్వీపైనే గెలిచి అదరగొట్టేసింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్‌లో దాదాపు 9 వారాల పాటు ఉంది. హౌసులోకి వచ్చేముందు వారానికి రూ.2లక్షల చొప్పున ఈమె అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.18 లక్షల వరకు పారితోషికం సొంతం చేసుకున్నట్లే. గతంలో ఈమె బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈసారి మాత్రం అటు డబ్బు, ఇటు మరింత గుర్తింపు రోహిణికి దక్కడం విశేషం.

(ఇదీ చదవండి: రోహిణితో పాటు విష్ణుప్రియ అవుట్‌.. ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్‌!)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)