Breaking News

'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!

Published on Sat, 08/05/2023 - 19:49

ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్, రణ్‌వీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్ సోదరిగా తనదైన నటనతో అందరినీ ఆకర్షించింది బుల్లితెర నటి అంజలి ఆనంద్. రణవీర్ సింగ్ సోదరిగా గాయత్రీ రంధవా పాత్రలో కనిపించిన ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. 

(ఇది చదవండి: వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!)

బుల్లితెర నటి అంజలి ఆనంద్ తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు వెల్లడించింది. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్ స్కూల్‌లో చేరినప్పుడు.. తనను శరీర బరువును కించపరిచేలా కొందరు మాట్లాడారని తెలిపింది. తనకు సినిమా ఛాన్స్‌లు రావనీ.. కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎ‍ద్దేవా చేశారని వివరించింది. తాను లావుగా ఉన్నందున కొందరు దారుణంగా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది. 

అంతకుముందు 'ధై కిలో రెమ్','కుల్ఫీ కుమార్ బజేవాలా' వంటి హిట్ టీవీ షోలతో తనదైన ముద్ర వేసింది. "కుల్ఫీ కుమార్ బజేవాలా"లో ప్రధాన పాత్రలో ఆమె తనదైన నటనతో అభిమానులను అలరించింది. కానీ అప్పట్లో ఆ పాత్రకు ప్రశంసల కంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయని తెలిపింది. లావుగా ఉన్న అమ్మాయి లీడ్‌ రోల్‌ ఎలా చేస్తుందని.. పలువురు తన క్యారెక్టర్‌ను కించపరిచేలా సందేశాలు పంపారని వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని తెలిపింది. 

'లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు? బహుశా ఆమె ఎవరితోనైనా కమిట్ అయినందువల్లే అయి ఉండొచ్చు' అని దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి వెల్లడించింది. అయితే వీటిపై తాను అదేస్థాయిలో స్పందించినట్లు వివరించింది. మనం ఇలాంటి వారి గురించి మాట్లాడటం మూర్ఖత్వమని విమర్శించింది. 

(ఇది చదవండి: 'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!)

కాగా.. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో అంజలి గాయత్రి పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. నటనకు కావాల్సింది టాలెంట్‌ అని.. శరీర బరువుతో సంబంధం లేదని అంజలి నిరూపించింది. అలా విమర్శలు చేసేవారికి తన నటనతోనే సరైన సమాధానమిచ్చింది. సినిమా ఇండస్ట్రీలో విజయమనేది అంకితభావం, కృషిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)