Breaking News

వద్దంటున్నా క్రికెటర్‌ చాహల్‌తో లింక్‌.. అసలెవరీ ఆర్జే మహ్‌వశ్‌?

Published on Thu, 03/13/2025 - 13:42

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal).. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, నటి, నిర్మాత, ఆర్‌జే మహ్‌వశ్‌ (RJ Mahvash) ప్రేమలో ఉన్నారంటూ కొద్ది నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే డేటింగేనా? ఎందుకిలా తయారయ్యార్రా బాబూ అని మహ్‌వశ్‌ తలపట్టుకుంది. కట్‌ చేస్తే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌కు వీరిద్దరూ కలిసి వెళ్లారు.

ఓపక్క సంతోషం.. మరోపక్క చికాకు
దీంతో లవ్‌ గాసిప్స్‌కు మరోసారి ఆజ్యం పోసినట్లైంది. తాజాగా మరోసారి ఈ రూమర్స్‌పై మహ్‌వశ్‌ ఘాటుగా స్పందించింది. ఈ మధ్యే తనకు ఉత్తమ మెగా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవార్డు వచ్చింది. అందుకు సంతోషపడుతూనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్‌వశ్‌ ఎంతో గర్విస్తోంది. ఇదే నాకు కావాల్సింది! ఏ తప్పు చేయకుండా, పనికిరాని విషయాలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి అని రాసుకొచ్చింది. డేటింగ్‌ కథనాలనుద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ పెట్టిందని తెలుస్తోంది.

భార్యకు చాహల్‌ విడాకులు!
కాగా టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్‌, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్‌ 20న వీరి వివాహం జరిగింది. కానీ ఐదేళ్లకే వీరు తమ దారులు వేరంటూ విడిపోయారు. వీరు విడిపోయాక చాహల్‌ ఎక్కువగా మహ్‌వశ్‌తో కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్‌ రూమర్స్‌ పుట్టుకొచ్చాయి.

ఎవరీ ఆర్‌జే మహ్‌వశ్‌?

  • మహ్‌వశ్‌ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్‌జే)గా పని చేస్తోంది.

  • సోషల్‌ మీడియాలో ప్రాంక్‌ వీడియోలు చేస్తూ పాపులర్‌ అయింది.

  • చాహల్‌తో డేటింగ్‌ కథనాల వల్ల జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల సంఖ్య నేడు 2.3 మిలియన్స్‌కు చేరింది.

  • నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్‌ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.

  • హీరోయిన్‌గా ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తోంది.

 

 

చదవండి: కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)