Breaking News

చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన ఆర్జే మహ్‌వశ్!

Published on Mon, 05/19/2025 - 18:52

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్‌వశ్‌ పేరు తెగ వినిపిస్తోంది. దీనికి కారణం ఈ ముద్దుగుమ్మకు టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్‌తో కనిపించడమే. వీరిద్దరు కలిసి దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌ వీక్షిస్తున్న సమయంలో ఫోటోలు పెద్దఎత్తున వైరలయ్యాయి. ఆ తర్వాతే ఈ జంట డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్‌ మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లోనూ మహ్‌వశ్‌ సందడి చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. కానీ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జే మహ్‌వశ్..‌ తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. అవీ తనను ఎలా ప్రభావితం చేశాయో వివరించింది. కొంతమంది ట్రోల్స్ కారణంగా ఇలాంటివీ జరుగుతూ ఉంటాయని తెలిపింది. కానీ అందులో ఎలాంటి నిజం లేకపోవడంతోనే వాటిని అంగీకరించలేకపోయానని పేర్కొంది. ఈ వ్యక్తులు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు.. నిజం తెలియనప్పుడు నా  జీవితం పట్ల  ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? అని బాధపడ్డానని వెల్లడించింది. అందుకే సోషల్ మీడియాను వదిలేసి ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆర్జే మహ్‍వశ్ తన బాధను పంచుకుంది. కానీ నాపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్‌ బాగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు చెప్పేవన్నీ కల్పితాలేనని.. మా మధ్య అలాంటిదేమీ లేదని ఆర్జే మహ్‌వశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

కాగా.. ఆర్జే మహ్‌వశ్‌  ప్యార్ పైసా ప్రాఫిట్ అనే సిరీస్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్  అమెజాన్ మ్యాక్స్ ప్లేయర్‌లో ప్రసారం అవుతోంది. ఈ షో ప్రీమియర్ అయినప్పుడు చాహల్ ఈ సిరీస్‌పై పోస్ట్ పెట్టారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)