Breaking News

మనమధ్య ఎన్నో గొడవలు.. మరణం తర్వాత కూడా..: కాజల్‌ ఎమోషనల్‌

Published on Sat, 06/21/2025 - 17:57

ఈ సంవత్సరం తనకెంతో స్పెషల్‌ అంటోంది నటి ఆర్జే కాజల్‌ (RJ Kajal). బిగ్‌బాస్‌ సీజన్‌ 5తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. తన భర్త విజయ్‌ శీలం శెట్టికి బర్త్‌డే విషెస్‌ చెప్తూ తమ జర్నీని రాసుకొచ్చింది. నా విజయ్‌కు హ్యాపీ బర్త్‌డే.. నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను. 2025.. ఈ ఏడాదికి నా మనసులో ప్రత్యేక చోటు దక్కింది. ఎందుకంటే మన జీవితంలోనే కీలకమైన మైలురాయి అయిన సొంతింటి కలను నెరవేర్చుకున్నాం.

ఎన్నో గొడవలు
ఇంకా ఆ ఇంట్లోకి మనం షిఫ్ట్‌ కాలేదనుకో.. కానీ, మనిద్దరం కలిసి ఆ ఇంటిని కొన్నందుకు ఆల్‌రెడీ అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఒకప్పుడు మనం చీకట్లో గుసగుసలాడుకునేవాళ్లం. ఇప్పుడవే గుసగుసలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే సంతోషంగా అనిపిస్తోంది. అలా అని మనమెప్పుడూ ఇంతే సంతోషంగా ఉండేవాళ్లం కాదు. ఎన్నోసార్లు పోట్లాడుకునేవాళ్లం. ఇంటీరియర్స్‌ గురించి, దిండుల గురించి, సమయపాలన గురించి.. కొన్నిసార్లయితే మరీ అనవసరమైన విషయాల గురించి కూడా గొడవపడేవాళ్లం. 

పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లం
ఆ రోజులో ఎన్ని గొడవలు పడ్డా కూడా రాత్రయ్యేసరికి దాన్ని పరిష్కరించుకునేవాళ్లం. ప్రశాంతంగా నీ కౌగిలిలో నిద్రపోతుంటే మన ప్రేమ కంటే ఏ గొడవా పెద్దది కాదనిపించేది. మరికొన్నిసార్లు పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లం. ఒకరి కాలు మరొకరు పట్టుకుని లాగేవాళ్లం. కొట్టుకుని అంతలోనే కలిసిపోయేవాళ్లం. మన బంధాన్ని మరింత ధృడంగా నిర్మించుకున్నాం. నువ్వు లేని జీవితం? అన్న ఆలోచనను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను.

మరణం తర్వాత కూడా..
కానీ సరదాగా ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మనమేం అనుకునేవాళ్లం? మనిద్దరి శవాలను పక్కపక్కనే సమాధి చేసి మరణం తర్వాత కూడా కలిసే ఉండాలనుకునేవాళ్లం. అంత గొప్ప ప్రేమను మనం ఒకరికొకరం పంచుకున్నాం. మన లవ్‌ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చేమో కానీ, అందమైన ప్రేమను ఆస్వాదిస్తున్నాం. ఈ రోజు, నీ పుట్టినరోజున ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వే నా ప్రపంచం.. నువ్వు నాకోసమే పుట్టావు. నాకు భర్తగా దొరికినందుకు థాంక్యూ.. అని కాజల్‌ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు భర్తతో కలిసి దిగిన ఫోటోలను జత చేసింది.

 

 

చదవండి: దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్‌ రెండో పెళ్లి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు