Breaking News

ట్రైనింగ్ పూర్తి.. హెయిర్ స్టైలిస్ట్‌గా మారిన హీరో!

Published on Mon, 01/15/2024 - 10:11

ఆర్‌జేగా జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ ఆ తరువాత హాస్యనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి ఆపై మెగాఫోన్‌ పట్టి సక్సెస్‌ అయ్యారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సింగపూర్‌ సెలూన్‌. గోకుల్‌ దర్శకత్వంలో వేల్స్‌ ఫిలిం పతాకంపై ఐసరీ గణేష్‌ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్‌, లాల్‌, జీవా, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

వీరితో పాటు ఒక ప్రముఖ నటుడు కీలక పాత్రను పోషించినట్లు దర్శకుడు చెప్పారు. వివేక్‌ మెర్విన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 25న తెరపైకి రానుంది. సింగపూర్‌ సెలూన్‌ చిత్రం సెన్సార్‌ బోర్డు నుంచి యూ సర్టిఫికెట్‌ పొందడం విశేషం. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందింది.

ఈ చిత్రం చైన్నెలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు గోకుల్‌ మాట్లాడుతూ.. చదువుకుంటున్న దశలోనే హెయిర్‌ స్టైలిస్ట్‌ కావాలని ఆశపడే ఒక సాధారణ వ్యక్తి కథే ఈ సినిమా అన్నారు. సింగపూర్‌ సెలూన్‌ చిత్రం తన కెరీర్‌లో 10 కాలాల పాటు గుర్తుండిపోతుందనే నమ్మకాన్ని బాలాజీ వ్యక్తం చేశారు. ఈ చిత్రం కోసం హెయిర్‌ స్టైలిస్ట్‌గా ప్రాథమిక శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు.

చదవండి:  'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు': ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)