Breaking News

మొన్న ఐటం సాంగ్‌.. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ సినిమాలో ఛాన్స్‌

Published on Thu, 11/09/2023 - 14:17

హీరోయిన్‌ రితికా సింగ్‌ను లక్కీ ఛాన్స్‌ వరించింది. రియల్‌ బాక్సర్‌ అయిన ఈ ఉత్తరాది చిన్నది ఇరుదుచుట్రు చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. సుధాకొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్‌ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో అదే చిత్రం తెలుగు రీమేక్‌ 'గురు'లోనూ రితికాసింగ్‌ హీరోయిన్‌గా నటించింది. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్‌ కట్టలై, రాఘవా లారెన్స్‌ సరసన శివలింగా, అశోక్‌ సెల్వన్‌తో ఓ మై కడవులే తదితర సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది.

కాగా ఈ మధ్య అవకాశాలు ముఖం చాటేయడంతో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన కింగ్‌ ఆఫ్‌ కొత్త చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ చేయడానికీ వెనుకాడలేదు. ఇకపోతే ఇన్‌స్ట్రాగామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వర్కౌట్స్‌ చేసిన వీడియోలను పోస్ట్‌ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అలా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. మొత్తం మీద తాజాగా మరో భారీ అవకాశాన్ని పొందింది.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఙానవేల్‌ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇప్పటికే నటి మంజువారియర్‌, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, తెలుగు నటుడు రానా, నటి దుషారా విజయన్‌ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇప్పుడు వీరి సరసన నటి రితికాసింగ్‌ చేరారు. ఇది ఈమెకు నిజంగా లక్కీఛాన్స్‌నే అవుతుంది.

చదవండి: ప్రియుడితో జబర్దస్త్‌ పవిత్ర నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి..

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)