Breaking News

తెలుగులో సినిమా ఛాన్సులు రావట్లేదా? హీరోయిన్‌ ఆన్సరిదే!

Published on Mon, 03/04/2024 - 12:14

'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ రితికా సింగ్‌. స్వతాహాగా కిక్‌ బాక్సర్‌ అయిన ఆమె ఈ చిత్రంలో కూడా బాక్సింగ్‌ చేస్తూ కనిపించింది. తర్వాత నీవెవరో అనే సినిమా చేసింది కానీ అంతగా క్లిక్‌ అవలేదు. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు. అయితే తమిళ, హిందీ భాషల్లో మాత్రం సినిమాలు చేసింది. దుల్కర్‌ సల్మాన్‌ కింగ్‌ ఆఫ్‌ కొత్త మూవీలో ఐటం సాంగ్‌ కూడా చేసింది.

ఆఫర్స్‌ రావడం లేదా?
ప్రస్తుతం రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వేటయ్య అనే సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే వళరి అనే హారర్‌ మూవీలోనూ యాక్ట్‌ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌లో రితికాకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. 'టాలీవుడ్‌లో పరభాషా నటీమణులే ఎక్కువగా ఉన్నారు. మీరు మాత్రం తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు. మీకు తెలుగులో ఆఫర్స్‌ రావడం లేదా?' అని ఓ విలేఖరి ప్రశ్నించాడు.

మనసుకు నచ్చితేనే..
ఇందుకు రితికా స్పందిస్తూ.. 'నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే సినిమా చేస్తాను. లేదంటే ఎట్టిపరిస్థితుల్లో చేయను. మలయాళం, మరాఠి, హిందీ.. ఏ భాష అయినా సరే కథ, పాత్ర నచ్చితేనే చేశాను. కాంబినేషన్‌ కరెక్ట్‌గా కుదిరితేనే సినిమా ఒప్పుకుంటాను' అని చెప్పుకొచ్చింది.

చదవండి: అదే రాళ్లపల్లి వీక్‌నెస్‌! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)