Breaking News

కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Published on Sat, 06/14/2025 - 19:03

కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి (Rishab Shetty) నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ కాంతార (Kantara Movie). 2022లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్‌ సాధించిన ఈ చిత్రానికి మేకర్స్‌ ప్రీక్వెల్‌ (కాంతార: చాప్టర్‌ 1) ప్రకటించారు.

అయితే ఏ ముహూర్తాన కాంతార 1 ప్రకటించారో కానీ అప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంతార నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్‌ కళాభవన్‌ విజు (43) గుండెపోటుతో మరణించాడు. తీర్థహళ్లిలో చిత్రయూనిట్‌తో బస చేసిన అతడికి బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. ఇతడు మాలికాపురం, మార్కో వంటి పలు చిత్రాల్లో నటించాడు. 25 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తున్నాడు.

గతంలో..
షూటింగ్‌ ప్రారంభించిన కొత్తలో కర్ణాటకలోని ముడూరులో 20 మంది జూనియర్‌ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారేమో తీవ్రమైన గాలివాన వల్ల భారీ సెట్‌ కూలిపోయింది. ఇటీవల మలయాళ జూనియర్‌ ఆర్టిస్ట్‌ కపిల్‌ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి విగతజీవిగా తేలాడు. ఆ తర్వాత కన్నడ నటుడు, హాస్య నటుడు రాకేశ్‌ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు కళాభవన్‌ కన్నుమూశాడు. ఈ వరుస విషాదాలు కాంతార చిత్రయూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అడవిలో పేలుళ్లు
అయితే నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. అడవిలో పెద్ద మంటలు వేసి షూటింగ్‌ చేస్తున్నారని, పేలుళ్లతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం అక్కడి అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టికి రాగా.. తక్షణమే షూటింగ్‌ ఆపేయాలని అధికారులను ఆదేశించారు.

ఇకపోతే పంజుర్లి దేవుడి ఆగ్రహంతోనే ఇలా జరుగుతోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాంతార సినిమాతోనే పంజుర్లి దేవుడు గురించి వెలుగులోకి వచ్చింది. పంజుర్లి అంటే పంది. చెడు చేసేవారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే భగవంతుడే పంజుర్లీ అని నమ్ముతారు.

చదవండి: మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్‌.. అవాక్కైన హీరో

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)