'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?

Published on Mon, 06/26/2023 - 19:23

రిషబ్ శెట్టి ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్‌ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. కాంతార సినిమాతో అంతలా ఫేమ్ సంపాదించాడు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

(ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!)

అయితే తాజాగా రిషబ్ ట్విటర్‌లో తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ఇటీవల తన ముద్దుల కూతురు రాధ్యాకు చెవులు కుట్టే వేడుక నిర్వహించారు. ఈ వేడుకను కర్ణాటకలోని రిషబ్ చిన్ననాటి ఇంటిలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనలయ్యారు రిషబ్. ఈ వేడుకలో తన భార్య, కుమారుడుతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. 

ట్విటర్‌లో రిషబ్ రాస్తూ..'నేను పెరిగిన ఇప్పుడు ఇల్లు జ్ఞాపకాలతో నిండిపోయింది. నా కూతురు రాధ్యా చెవి కుట్టే వేడుకతో మా ఇల్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కాంతార-2 కోసం వెయిటింగ్ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా రిషబ్ గారాలపట్టి చెవులు కుట్టే వేడుక చూసేయండి. కాగా.. కాంతార-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో ఉగాది సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)