Breaking News

నా ఫస్ట్‌ చాయిస్‌ డైరెక్షన్‌: రిషబ్‌ శెట్టి

Published on Sun, 10/12/2025 - 01:36

ఎన్టీఆర్‌గారు నాకు సోదరుడులాంటివారు. మా కుందాపూర్‌ మూలాలు ఉన్న అబ్బాయి. ఆయన చేసిన సపోర్ట్‌కి రుణపడి ఉంటాను. ఇక ప్రశాంత్‌ నీల్‌గారితో ఎన్టీఆర్‌గారు చేస్తున్న సినిమాలో నేను నటిస్తున్నానన్న విషయంపై ప్రస్తుతానికి నేను ‘మ్యూట్‌’.

‘‘భారతదేశం జానపద కథలకు నిలయం. నాకు జానపద కథలు చేయడం అంటే ఇష్టం. ‘కాంతార’ సినిమా కథను నిజాయితీగా చెప్పాలనుకున్నా. అది ప్రేక్షకులకు నచ్చింది’’ అని దర్శక–నిర్మాత–నటుడు రిషబ్‌ శెట్టి అన్నారు. రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార:చాప్టర్‌ 1’. ‘కాంతార’ (2022) సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార:చాప్టర్‌ 1’ రూపొందింది.

విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 509 కోట్ల వసూళ్లు సాధించి, సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోందని యూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో రిషబ్‌ శెట్టి చెప్పిన విశేషాలు.

⇒ ‘కాంతార’ సినిమాకు ఎలాంటి స్పందన లభించిందో, ‘కాంతార: చాప్టర్‌ 1’కూ అలాంటి గొప్ప రెస్పాన్సే ప్రేక్షకుల నుంచి లభిస్తోంది  ‘కాంతార’ చేసేటప్పుడే ‘కాంతార: చాప్టర్‌ 1’ గురించిన ఆలోచన ఉంది. ‘కాంతార’ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, ‘కాంతార: చాప్టర్‌ 1’ కథ రాయడం మొదలుపెట్టాను. 

⇒ చిన్నప్పట్నుంచి మా ఊరి (కుందాపూర్‌) కథలు చెప్పాలని ఉండేది. ‘కాంతార’ మా ప్రాంతంలో జరిగిన కథ. అందుకే లొకేషన్స్‌ను మా ప్రాంతంలోనే తీసుకోవడం జరిగింది. మేజర్‌ షూటింగ్‌ని మా ఊర్లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో జరిపాం.

⇒ నాలో దర్శకుడు ఉన్నాడు... యాక్టర్‌ ఉన్నాడు. ఈ రెండింటిలో ఏది ఫస్ట్‌ అంటే డైరెక్షనే అని చెబుతాను. 
⇒ ముంబైలోని ఓ నిర్మాణ సంస్థలో డ్రైవర్‌గా పని చేశాను. ఇప్పుడు మంచి సక్సెస్‌లో ఉన్నాను. ఆర్టిస్టుగా జాతీయ అవార్డు అందుకున్నాను. నా జర్నీలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. అలాగే ‘కాంతార’ జర్నీలో, నా జీవితంలో నా భార్య (ప్రగతి శెట్టి) ఇచ్చిన స పోర్ట్‌ను మర్చి పోలేను. ఒకవైపు ‘కాంతార’ సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేస్తూనే, మరోవైపు నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంది. తను డబుల్‌ రోల్‌ చేసింది.

⇒ ప్రస్తుతం తెలుగులో ఓ పీరియాడికల్‌ మూవీ, హిందీలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ బయోపిక్‌ చిత్రాల అనౌన్స్‌మెంట్‌ వచ్చాయి. కానీ నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ‘జై హనుమాన్‌’.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)