Breaking News

సుశాంత్‌ మరణం.. ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు: నటి

Published on Thu, 11/16/2023 - 14:52

నటుడు సుశాంత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌ను కుదిపేసింది. ఇది ఆత్మహత్య కాదని అనుమానాలు వ్యక్తం కావడం, డ్రగ్స్‌ కోణం కూడా బయటపడటంతో సుశాంత్‌ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి మెడకు ఈ కేసు చుట్టుకుంది. పోలీసులు రియాతో పాటు ఆమె సోదరుడిని కూడా అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో జైలు జీవితం గడిపిన ఈ నటి కొన్ని వారాల తర్వాత బెయిల్‌ మీద బయటకు వచ్చింది. తాను ఏ తప్పూ చేయలేదని చెప్తున్నా ఆమెపై వ్యతిరేకత మాత్రం పోవడం లేదు.

ట్రోలింగ్‌ దాదాపు తగ్గింది.. కానీ..
అంతేకాదు, తన కెరీర్‌ సైతం దెబ్బతిందని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'భయం, ట్రోలింగ్‌.. ఇలా చాలా ఫేస్‌ చేశాను. పరిస్థితి కొంత సద్దుమణిగింది. త్వరలోనే వాతావరణం అంతా మామూలైపోతుందనుకుంటున్నాను. ముఖ్యంగా ట్రోలింగ్‌ అయితే చాలావరకు తగ్గిపోయింది. గతంలో అయితే సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కొన్న వ్యక్తిగా నేను మొదటి స్థానంలో ఉన్నాను.

నాకు ఛాన్సులు ఇవ్వడానికి భయపడుతున్నారు
ఆ స్థాయిలో నాపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో నా స్నేహితులు, కుటుంబం ఇచ్చిన అండదండల వల్లే బలం కూడగట్టుకుని నిలబడ్డాను. కానీ నాకు బాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదు. ఎవరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. నన్ను సినిమాలోకి తీసుకునేందుకు భయపడుతున్నారు' అని బాధపడింది. కాగా రియా చక్రవర్తి 2021లో వచ్చిన చెహర్‌ సినిమాతో చివరిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత బుల్లితెరపై ప్రసారమైన ఎమ్‌టీవీ రోడీస్‌: కరమ్‌ యా ఖాంద్‌ అనే రియాలిటీ షోలో గ్యాంగ్‌ లీడర్‌గా మెప్పించింది.

చదవండి: నెలసరి ఆలస్యం.. బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)