Breaking News

'నా పెళ్లాం దెయ్యం'.. ఆర్జీవీ టైటిల్ అదరహో!

Published on Wed, 03/20/2024 - 16:26

టాలీవుడ్‌ సంచలన డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే వ్యూహం, శపథం లాంటి సినిమాలతో సినీ ప్రియులను అలరించారు. తాజాగా మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శారీ మూవీని తెరకెక్కిస్తోన్న ఆర్జీవీ.. మరో ఆసక్తికర సినిమాను ప్రకటించారు. 'నా పెళ్లాం దెయ్యం' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

రాంగోపాల్ వర్మ పోస్టర్‌ను ఏలాంటి క్యాప్షన్ లేకుండా రిలీజ్ చేశారు. అందులో నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్ తోపాటు.. తాళి తీసి పడేసినట్లుగా.. బ్యాక్‌గ్రౌండ్లో కిచెన్‌లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూపించారు. కాగా.. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ వెల్లడించారు. నా పెళ్లాం దెయ్యం పేరుతో మూవీని తీయబోతున్నట్లు తెలిపారు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్లాం దెయ్యమనే అంటారని.. నాకు కూడా నిజ జీవితంలో అలాగే అనిపించిందని అప్పట్లోనే ఆర్జీవీ అన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)