Breaking News

సూర్యకు గిఫ్ట్‌ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్‌..

Published on Sun, 05/11/2025 - 11:23

నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రెట్రో.. నటి పూజా హెగ్డే ఇందులో నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించారు. అయితే,  సూర్య, కార్తీక్‌ సుబ్బరాజుకు చెందిన సొంత నిర్మాణ సంస్థలే రెట్రోను తెరకెక్కించాయి.  మే  1న విడుదలైన ఈ మూవీ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్‌ ఫుల్‌ జోష్‌తో ఉంది. అయితే, ఈ మూవీని శక్తి ఫిలిమ్‌ ఫ్యాక్టరీ సంస్థ అధినేత శక్తి వేలన్‌ తమిళనాడులో డిస్ట్రిబ్యూషన్‌ చేశారు. కాగా రెట్రో చిత్రం విజయాన్ని పురస్కరించుకొని ఆయన ఆనందంగా ఆ చిత్ర యూనిట్‌కు విలువైన బహుమతులను అందించారు.

చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు సూర్యకు కానుకగా వజ్రపుటుంగరాన్ని శక్తి వేలన్‌ అందించారు. అదేవిధంగా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌కు, చాయాగ్రహకుడు, సంగీత దర్శకుడు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులందరకి వజ్రపుటుంగరాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను దాటి పరుగులు తీస్తోందన్నారు. ఈ ఏడాది విడుదల చిత్రాలలోనే అధిక లాభాలు తెచ్చి పెట్టిన చిత్రం ఇదేనన్నారు. 

ఉచిత డిస్ట్రిబ్యూషన్‌ చేసే అవకాశాన్ని తనకు కల్పించిన నటుడు సూర్య ,రాజశేఖర పాండియన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఇంతకుముందు సూర్య నిర్మించిన కడైకుట్టి సింగం(చినబాబు ) చిత్ర సక్సెస్‌ వేడుక సందర్భంగా బంగారు గొలుసును, అదేవిధంగా  విరుమాన్‌ చిత్ర విజయం సాధించిన సందర్భంగా బంగారు బ్రేస్లెట్‌ను సూర్యకు కానుకగా అందించగా ఆయన వాటిని మళ్లీ తనకే తిరిగి ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వజ్రపుటుంగరాన్ని తనకే ఇచ్చారని చెప్పారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)