ఎ‍ట్టకేలకు '100' కొట్టేసిన సూర్య

Published on Tue, 05/06/2025 - 18:27

సూర్య లేటెస్ట్ మూవీ 'రెట్రో'. తెలుగులో రిలీజైన మొదటిరోజు నుంచే ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రావట్లేదు. మరోవైపు తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి టాక్, వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఎలాగోలా వంద మార్క్ దాటేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

గతేడాది సూర్య నటించిన కంగువ సినిమా రిలీజైంది. దీనిపై సూర్యతో పాటు అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ డిజాస్టర్ అయింది. దీంతో 'రెట్రో'తో కమ్ బ్యాక్ గ్యారంటీ అనుకున్నారు. ‍కానీ ఇది తమిళనాడు వరకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. తాజాగా ఐదు రోజుల తర్వాత రూ.104 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)

ఎలాగైతేనేం సూర్య మూవీకి రూ.100 కోట్లు వచ్చేశాయి. ఈ విషయంలో అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ తెలుగులోనూ హిట్ అయ్యింటే ఈ నంబర్స్ మరింత పెరిగేవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరోవైపు నాని హిట్ 3 చిత్రానికి నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రోజు పోస్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే సూర్య కంటే నానినే ముందున్నాడు.

ప్రస్తుతం సూర్య.. తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ఇదివరకే ప్రకటించేశారు కూడా.

(ఇదీ చదవండి: జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)