Breaking News

దర్శన్‌ మా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపుతా: రేణుకాస్వామి తండ్రి

Published on Sat, 07/27/2024 - 14:44

రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్‌ హీరో దర్శన్ A2 గా ఉన్నారు. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా శిక్ష అనుభవిస్తున్నారు. దర్శన్‌కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో ఆహారం కోసం జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.

తాజాగా కన్నడ సీనియర్‌ హీరో వినోద్‌రాజ్‌ పరప్పన జైలులో ఉన్న దర్శన్‌ను కలుసుకున్నారు. ఆయన్ను పరామర్శించిన వారం తర్వాత రేణుకాస్వామి కుటుంబాన్ని కలుసుకున్నారు. అక్కడ వారి పరిస్థితి చూసి ఆయన చలించిపోయారు. రేణుకాస్వామి సతీమణితో పాటు ఆయన తండ్రి ఇప్పటికీ కోలుకోకుండా ఉన్నారని తెలిపాడు. ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం వీధినపడుతుందని, ఆ లోటును భగవంతుడు కూడా తీర్చలేడన్నారు. కుటుంబానికి ఆయన రూ. లక్ష సాయం అందించారు.

నటుడు దర్శన్‌ గురించి రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో దర్శన్‌  విడుదల అయ్యాక తన ఇంటికి వస్తే భోజనం పెడతానని, తాము జంగమ సామాజికవర్గం వారమని, ద్వేషం, అసూయ వంటివి ఉండవన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం కావాలన్నారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి తన భర్త కోసం పోరాడటంలో తప్పులేదని ఈక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి ఆమె ఏం మాట్లాడారు అనే సంగతి తమకు అనవసరమని ఆయన అన్నారు. జైలులో ఉన్న దర్శన్‌ ఆరోగ్యం బాగుండాలని త్వరగా విడుదల కావాలని కోరుతూ భార్య విజయలక్ష్మి నవ చండికా హోమం జరిపించారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)