Breaking News

హీరోగా అకీరా నందన్.. రేణూ దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sat, 01/03/2026 - 17:01

ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌- పవన్‌ కల్యాణ్‌ల తనయుడు అకీరా నందన్‌ సినిమాల్లోకి వస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అకీరా డెబ్యూ కోసం మెగా ఫ్యాన్స్‌ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఎప్పుడనేది అటు పవన్‌ కానీ, ఇటు రేణూ దేశాయ్‌ కానీ కచ్చితంగా చెప్పడం లేదు.

 కొంతమంది బడా దర్శక-నిర్మాతలు మాత్రం అకీరాతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ అయితే తనకు చాన్స్‌ ఇస్తే..అకీరాతో పాన్‌ వరల్ట్‌ సినిమా చేస్తానని చెబుతున్నాడు. అయితే అకీరా(Akira Nandan)కు మాత్రం మొదటి నుంచి నటన మీద కన్నా సంగీతం మీదనే మక్కువ ఎక్కువ. అసలు ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో అకీరా సినీ ఎంట్రీపై తల్లి రేణూ దేశాయ్‌(Renu Desai ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అకీరా హీరో అవ్వాలని అందరికంటే ఎక్కువ తనే కోరుకుంటున్నానని చెప్పారు.

తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా సినీ ఎంట్రీ గురించి స్పందించారు. ‘అకీరా త్వరగా హీరో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను.  అందరిలానే నేను కూడా హీరో ఎప్పుడు అవుతావని అకీరాను అడుగుతుంటాను. ప్రతి ఇంటర్వ్యూలోనూ నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒకటే చెబుతున్నా.. నేను వాడి కన్న తల్లిని..  అకీరా హీరో అవ్వాలని మీ (ఫ్యాన్స్‌) కంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను.  అయితే హీరో అవ్వాలా వద్దా అనేది మాత్రం అకీరా ఇష్టం’ అని రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చింది.

 ఇక హీరో అవ్వాలని అకీరాకు ఇష్టం ఉందా లేదా ? అని యాంకర్‌ అడగ్గా.. ‘ఈ టాపిక్‌ గురించే మాట్లాడొద్దు.. తర్వాత అకీరా నన్ను తిడతాడు. ‘మమ్మీ నా గురించి ఎందుకు మాట్లాడావ్‌ ’ అంటూ అలుగుతాడు’ అని నవ్వుతూ చెప్పారు. ఇక ఆమె కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిగా కొనసాగుతానని చెప్పారు. 

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)