Breaking News

మహేశ్‌ బాబు సినిమా వదులుకున్నా.. ఆ నిజం చెప్తే గొడవలే: రేణు దేశాయ్‌

Published on Thu, 10/19/2023 - 21:13

మాస్‌ మహరాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్‌ నాగేశ్వరరావు'  అక్టోబర్‌ 20న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది. 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ అయన  ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రేణు దేశాయ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుమారు 18 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్‌ బాబు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఆమె పంచుకున్నారు.

(ఇదీ చదవండి: ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్‌.. నటుడి కామెంట్లు)

మహేశ్‌బాబు- పరుశురామ్‌ కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమాలో తనకు నటించే ఛాన్స్‌ వచ్చిందని రేణు దేశాయ్‌ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని ఆమె తెలిపారు. కాంట్రవర్సీని దృష్టిలో ఉంచుకుని  ఆ విషయాలను ఇప్పుడు చెప్పలేకపోతున్నానని ఆమె ఇలా తెలిపారు.  'మహేశ్‌ బాబు సూపర్‌ హిట్‌ సినిమా 'సర్కారు వారి పాట' సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో నదియా పోసించిన బ్యాంక్‌ ఆఫీసర్‌ పాత్ర కోసం మొదట నన్ను సంప్రదించారు. అందులో నటించాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అందుకు నేను కూడా ఓకే చెప్పాను.

కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఎందుకు సెట్‌ కాలేదో అనే కారణాలను మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు చెప్పడం వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్‌ అవుతుంది. నిజం ఏమిటో చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది.. కానీ మళ్లీ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కామ్‌గా ఉండటమే బెటర్‌.' అని రేణు తెలిపారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)