Breaking News

అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Published on Fri, 10/13/2023 - 17:54

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. అక్టోబర్ 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న నటి రేణు దేశాయ్.. తన గురించి, సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)

హేమలత లవణం పాత్ర గురించి? 
హేమలత లవణం.. ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ బందీపోట్లని కలిశారు. జోగిని వ్యవస్థ, అంటరానితనంపై పోరాటం చేశారు. ఇలాంటి గొప్ప పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం. రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఓ మంచి అనుభవం.  

హీరోయిన్, డిజైనర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఈ జర్నీ ఎలా ఉంది? 
నేను డిజైనర్ కాదు. ఒరిజినల్ స్టయిలిస్ట్‌ని. కలర్స్‌పై మంచి అవగాహన వుంది. ఏ కలర్‌కి ఏది మ్యాచ్ అవుతుందో నాకు తెలుసు. ఖుషి సినిమాకు అనుకోకుండా స్టైలిష్ట్‌గా మారాను. అలాగే సామాజిక కార్యక్రమాలు, కవిత్వం రాయడం.. వీటిలో ఏది ప్లాన్ చేసి చేసినవి కాదు.  

(ఇదీ చదవండి: టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌లో ప్రమాదం.. రవితేజ మోకాలికి తీవ్ర గాయం..)

అకీరా హీరోగా ఎప్పుడు? 
హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా  నేర్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా.   

నటన కొనసాగిస్తారా?
నాకు నటన ఎప్పుడూ కొనసాగించాలనే వుంటుంది. నా వయసుకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను.

(ఇదీ చదవండి: 'వ్యూహం' ట్రైలర్‌: కల్యాణ్‌కు తెలివి లేదు.. ఎన్నికల తర్వాత గ్లాస్‌ పగిలిపోతుంది)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)