Breaking News

సినిమాల్లోకి అకీరా నందన్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే?

Published on Sun, 01/05/2025 - 16:03

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. 2023లో చివరిసారిగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి ఆధ్యాత్రిక యాత్రలో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే కాశీ పర్యటనకు వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది రేణు దేశాయ్. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడు అకీరా నందన్‌ సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందించింది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ..' ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒక మదర్‌గా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి' అని అన్నారు.

గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ..'గోదావరి జిల్లాల్లో ఉండే అందమైన లొకేషన్స్ నేను ఎప్పుడూ చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు అద్భుతంగా ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం సంతోషం. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశా' అని అన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)