Breaking News

ముహూర్తం పెట్టాక పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నా, ఎందుకంటే?: నటి

Published on Sat, 08/05/2023 - 13:27

సీరియల్స్‌లో విలనిజం పండించే పాత్రలకు పెట్టింది పేరు రెనీ ధ్యాని. రాత్రి కి యాత్రి, కసమ్‌, చంద్రఖాంత, యే తేరి గాలియాన్‌, ఆప్‌కీ నజ్రోన్‌ నే సమ్‌జా.. ఇలా ఎన్నో సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. నటనకు కొంత గ్యాప్‌ ఇచ్చి పర్సనల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తోంది. 'నటిగా భిన్న పాత్రల్లో యాక్ట్‌ చేస్తూ రావడం వల్ల కొంత అలసటకు లోనయ్యాను. మళ్లీ ఈ ప్రపంచంతో కనెక్ట్‌ కావడానికి బ్రేక్‌ అవసరమని భావించాను. నెగెటివ్‌ రోల్స్‌ చేయడం వల్ల నాపై పడిన ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా తీసేయాలనుకున్నాను. నా మనసును, మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకున్నాను. అందుకే 9 నెలల బ్రేక్‌ తీసుకున్నాను.

ఈ బ్రేక్‌ నాకు చాలా ఉపయోగపడింది
పైగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్నాను. అందులో భాగంగానే వివిధ తీర్థయాత్రలకు వెళ్లాను. గత కొన్నేళ్లుగా నాతో దూరంగా ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి కాలక్షేపం చేసి ఎన్నో మధురమైన అనుభవాలు మూటగట్టుకున్నాను. ఈ అనుభవాలు తిరిగి నేను మూలాలతో కనెక్ట్‌ అయ్యేందుకు దోహదపడ్డాయి. నన్ను నేను తిరిగి చూసుకున్నాను. ఇప్పుడు నేను నా భావోద్వేగాలను, కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలను. అందరూ నా పెళ్లి రద్దు గురించి అడుగుతున్నారు.. నిజానికి నా పేరెంట్స్‌ నా పెళ్లి గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఓ సంబంధం తీసుకురాగానే సరేనని తలాడించాను. కానీ పెళ్లంటే చిన్న విషయం కాదు.

అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు
ఎన్నో బరువుబాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అసలే చాలా పెళ్లిళ్లు మధ్యలోనే విచ్ఛిన్నమవుతాయి. నాకొక తోడు కావాలన్న ఆలోచన కూడా లేని సమయంలో ఆదరాబాదరాగా పెళ్లి చేసుకోవడం అవసరమా? అనిపించింది. ఇప్పుడే వెళ్లి వద్దు అని నాన్నకు చెప్పేశా. ఆయన అర్థం చేసుకున్నాడు. నా నిర్ణయాన్ని గౌరవించాడు.  అలా పెళ్లి రద్దు చేసుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా రెనీ గతేడాది జూలై 3న ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సత్య వర్మతో పెళ్లికి సిద్ధమైంది. కానీ అంతలోనే పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తెలిపింది.

చదవండి: లలిత్‌ మోదీతో బ్రేకప్‌.. సుష్మిత సేన్‌ క్లారిటీ

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి