Breaking News

రెజీనాకు మరోసారి ఛాన్స్‌ ఇస్తున్న స్టార్‌ హీరో

Published on Mon, 12/15/2025 - 06:54

అజిత్‌ తన 64వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన ఆస్ట్రేలియాలో జరుగుతున్న అంతర్జాతీయ కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అజిత్‌ ఇంతకుముందు నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం విడుదలై కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత కార్‌ రేస్‌ పోటీల్లో పాల్గొనడంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే మరోపక్క ఈయన నటించనున్న తన 64వ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

 

అదేవిధంగా సంబంధించిన కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న ప్రకటన కోసం అజిత్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రీలీల నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రంలో శ్రీలీలతోపాటు మరో నాయకి కూడా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఆమె ఎవరో కాదు రెజీనా. ఈమె ఇంతకుముందు అజిత్‌తో కలిసి విడాముయర్చి చిత్రంలో నటించారన్నది గమనార్హం. అందులో ఆమె ప్రతినాయకి పాత్రలో నటించారు. అలాంటిది తాజా చిత్రంలో రెజీనా పాత్ర ఎలా ఉంటుంది అనే ఆసక్తి కలుగుతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మించే నిర్మాత ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నది గమనార్హం. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)