Breaking News

సందీప్‌, సాయి ధరమ్‌తేజ్‌తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్‌

Published on Sat, 09/14/2024 - 08:17

రెజీనా కసాండ్రా తన ఎఫైర్స్‌ గురించి తాజాగా రివీల్‌ చేశారు. తను నటించిన కొత్త చిత్రం 'ఉత్సవం' విడుదల సందర్భంగా ఆమె ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా, టాలీవుడ్‌లో  పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్‌ అయింది. అయితే, ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్‌ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్‌ హీరో సందీప్ కిషన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్‌తో రెజినా రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వారిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోనుందంటూ కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. అయితే, సందీప్‌ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఆమె స్నేహితురాలు మాత్రమే.. దయచేసి ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయకండి అంటూ పేర్కొన్నారు. తాజాగా రెజీనా కూడా రియాక్ట్‌ అయ్యారు.

'సందీప్‌, సాయి ధరమ్‌తేజ్‌ ఇద్దరూ కేవలం స్నేహితులు అయినప్పటికీ, వారితో నా అనుబంధం చాలా భిన్నంగా ఉంటుంది. సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. మేము ఇద్దరం ఒకరిపై మరొకరం తరచూ అరచుకుంటాం. ఒక్కోసారి ఒకరితో ఒకరం రెండు నెలలు మాట్లాడుకోము. కానీ, కాస్త గ్యాప్‌ తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెడుతాం. మా సంభాషణ ఎలా ఉంటుందంటే.. అసలు మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు అనేంతగా ఉంటుంది. 

ఇదీ చదవండి: హీరోయిన్‌ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్‌

సాయి కూడా నాకు చాలామంచి స్నేహితుడు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా స్వీట్‌ పర్సన్‌. అతనితో నా బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సందీప్‌తో గొడవపడినట్లు సాయితో జరగదు. అలా మేమిద్దరం ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అయినప్పటికీ, ప్రేక్షకులు మాకు ఎప్పుడూ సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తుంటారు.' అని రెజీనా తెలిపింది. కొద్దిరోజుల క్రితం కూడా  ఓ బిజినెస్‌మేన్‌తో రెజీనా వివాహం అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా ఆమె పెళ్లి చుట్టూ పుకార్లు వస్తూనే ఉన్నాయి.

అదే ఇంటర్వ్యూలో రెజీనాకు ఎలాంటి వ్యక్తి కావాలో కూడా చెప్పుకొచ్చింది. బాధ్యత తెలియని వ్యక్తితో కలిసి ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదని చెప్పింది. తనను జాగ్రత్తగా చూసుకునే వాడు అయితే చాలు అంటూ ఆమె పేర్కొంది. తన జీవితంలో చాలామందితో  రిలేషన్‌షిప్‌లో ఉన్నాను షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఒక రకంగా తాను సీరియల్ డేటర్ అంటూ నవ్వేసింది. అయితే, ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నానని, ఇప్పుడు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ మాత్రమే తనకు ఉన్నారిని చెప్పింది. ఈ విషయంలో తాను ఎలాంటి అబద్దం చెప్పడంలేదని పేర్కొంది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)