Breaking News

పెళ్లికి నో చెప్పిన విజయ్‌.. తమన్నా బ్రేకప్‌కి కారణం ఇదేనా?

Published on Thu, 03/06/2025 - 15:45

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia )... గత కొంత కాలంగా ప్రముఖ నటుడు, విలన్‌ క్యారెక్టర్స్‌కి పేరొందిన విజయ్‌ వర్మ( Vijay Varma) తో డేటింగ్‌లో ఉన్న విషయం బహిరంగ రహస్యమే. త్వరలో వాళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారన్నది కూడా తెలిసిన విషయమే. తమన్నా  విజయ్‌ వారి తల్లిదండ్రుల అంగీకారంతో ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారనీ ఈ జంట వివాహానంతరం వారి నివాసం కోసం ముంబైలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ వెతకడం కూడా పూర్తయిందని ఈ ఏడాది మొదట్లోనే వార్తలు వచ్చాయి. 

ఇటీవల ఒక ఇంటర్వూలో సైతం తమన్నా త్వరలో తమ పెళ్లి జరుగనున్నట్టు చెప్పింది.‘పెళ్లికి నా  కెరీర్‌కి మధ్య ఎటువంటి సంబంధం లేదు. వివాహం తర్వాత నటనను కొనసాగిస్తాను’ అని కూడా చెప్పింది. కట్‌ చేస్తే..ఇప్పుడు వారిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్త బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. తమ ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి..మంచి స్నేహితులుగా ఉండటానికి ప్లాన్‌ చేసుకున్నారని నేషనల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వారిద్దరు విడిపోవడానికి గల కారణాలపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కెరీర్‌, పెళ్లి విషయంలో వీరిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయని.. అందుకే విడిపోయారని బీటౌన్‌లో టాక్‌ నడుస్తోంది.

తమన్నా ప్రస్తుత వయసు 35 ఏళ్లు. ఇప్పటికే టాలీవుడ్‌, బాలీవుడ్‌,కోలీవుడ్‌లో పదుస సంఖ్యలు సినిమాలు చేసింది. ఇక సినిమాకు కాస్త గ్యాప్‌ ఇచ్చి పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామని తమన్నా భావిస్తోందట. అందుకే చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అయితే విజయ్‌కి మాత్రం అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట. కెరీర్‌ పరంగా ఇంకా ఎదగాలని.. కొన్నాళ్ల పాటు సినిమాలపైనే ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నాడట. ఈ విషయంలో ఇద్దరికి గొడవ జరిగి.. చివరకు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట.

హ్యాపీడేస్‌ తో సినీరంగానికి పరిచయమైన తమన్నా భాటియా అంచలంచెలుగా ఎదుగుతూ ఇండియన్‌ స్క్రీన్‌ మీద తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవలే హాట్‌ గా కనిపించడానికి, ఎక్స్‌పోజింగ్‌కు సైతం తమన్నా సై అంటుండడంతో ఇప్పటికీ ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.  తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన స్త్రీ 2లోని తమన్నా ఐటమ్‌ సాంగ్‌ ఆజ్‌ కీ రాత్‌... ఉత్తరాదిని ఊపేసింది.  ఇక మన హైదరాబాద్‌కు చెందిన  నటుడు విజయ్‌ వర్మతో 2023లో లస్ట్‌ స్టోరీస్‌ 2లో కలిసి స్క్రీన్‌ స్పేస్‌ను పంచుకున్నారు. 

అప్పటికే ఇద్దరూ డేటింగ్‌ చేస్తుండడంతో...ఆ లస్ట్‌ స్టోరీస్‌లో తమన్నా తొలిసారి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది కూడా. ఆ తర్వాత వారిద్దరూ తమ  సంబంధాన్ని పబ్లిక్‌గా మార్చారు.  అనేక పబ్లిక్, రెడ్‌ కార్పెట్‌ ప్రదర్శనలు, విహారయాత్రలు జంటగా కొనసాగించారు, వవృత్తిపరంగా ఒకరికొకరు మద్దతు ఇవ్వడమే కాకుండా చాలా మందికి  అభిమాన జంటగా ఎదిగారు. అలాంటి వీరిద్దరూ అకస్మాత్తుగా బ్రేకప్‌ చెప్పుకోవడం అభిమానుల్ని షాక్‌కి గురి చేసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)