Breaking News

పాన్‌ ఇండియా భాషల్లో రజాకార్.. ట్రైలర్‌ రిలీజ్‌!

Published on Thu, 02/22/2024 - 11:06

సమర వీర్‌ క్రియేషన్స్‌ పతాకంపై గూడూర్‌ నారాయణరెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రజాకర్‌'. యధా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఇందులో బాబీ సింహా, వేదిక జంటగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర తమిళ వర్షన్‌ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర నిర్మాత గూడూర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమర్‌ వీర్‌ క్రియేషన్స్‌ సంస్థ తరపున యూనిట్‌ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

స్వాతంత్య్ర పోరాటం కాలంలో హైదరాబాదులో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రమని చెప్పారు. 1948లో హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం కాకముందు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంపై రూపొందించిట్లు చెప్పారు. నిజాం రాజు హైదరాబాదును దుర్గిస్తాన్‌గా మార్చే ప్రయత్నం చేసినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు. తమ వంశంలో తన తాత కూడా ఆ పోరాటంలో పాల్గొని ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి ఒక యదార్థ ఘటనపై ఈ తరం ప్రజలకు తెలియచేయాలనే ప్రయత్నమే ఈ రజాకర్‌ చిత్రమని చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్రం నిర్మాత నారాయణరెడ్డి తాత పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారన్నారు. మరుగున పడ్డ చరిత్ర ప్రజలకు తెలియచేయాలనే లక్ష్యంతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించడం గర్వకారణమని పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)