Breaking News

ఈగల్ మేకర్స్ డేరింగ్ స్టెప్.. ఆ విషయంలో షాకింగ్ డెసిషన్!

Published on Tue, 02/06/2024 - 16:35

సంక్రాంతి రావాల్సిన మాస్ మహారాజా ఫిబ్రవరికి రెడీ అయిపోయారు. రవితేజ, అనుమప పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్ ఈగల్ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సైతం గ్రాండ్‌గా నిర్వహించారు. గతేడాది రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావుతో అలరించిన మాస్ హీరో మరోసారి ఫుల్ యాక్షన్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు. అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు చిత్రబృందం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసుకుందాం. 

పెద్ద సినిమాలు అంటే టికెట్ల రేట్స్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. మొదటి రోజు బుకింగ్స్ దొరకడం కూడా కష్టమే. సినిమా బడ్జెట్‌ ఆధారంగా మేకర్స్‌ టికెట్‌ రేట్లు పెంచేస్తుంటారు. పెద్ద హీరోల సినిమాలకు ప్రభుత్వాలు సైతం ధర పెంచుకునేందుకు సడలింపులు ఇస్తాయి. కానీ ఈగల్ మేకర్స్ మాత్రం ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈగల్ సినిమా టికెట్లను మామూలు రోజుల్లో ఉండే ధరలకే అందుబాటులో ఉంచారు. 

హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లో ఉండే టికెట్ ధర రూ.200, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.150కే పరిమితం చేశారు. అత్యధికంగా మల్లీప్లెక్స్‌లలో టికెట్‌ ధర రూ.295 వరకు పెంచుకునే అవకాశం ఉంది. కానీ ఈగల్ సినిమాను ఎక్కువమంది చూడాలనే ఉద్దేశంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభం కాగా.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ రూ.200 మాత్రమే చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షల సమయం కావడంతో స్టూడెంట్స్‌ చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇది కూడా ఒక కారణం అయినప్పటికీ.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు అనిపిస్తోంది. 

ర్యాప్ వీడియో వైరల్

అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈగల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ యువకుడు రవితేజ సినిమాలను డైలాగ్స్‌తో అదిరిపోయేలా పాట పాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సైతం ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.


 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)