Breaking News

ఓవర్‌ చేయకు అంటూ డైరెక్టర్‌కు రవితేజ పంచ్‌

Published on Sun, 06/23/2024 - 13:19

​ప్రస్తుతం మాస్‌ మహారాజ ఫోకస్‌ అంతా మిస్టర్‌ బచ్చన్‌ మీదే ఉంది. ఈ మూవీని హరీష్‌ శంకర్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం రవితేజ ఎంతగా కష్టపడుతున్నాడనేది ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో చెప్తూనే ఉన్నాడు హరీష్‌. హీరోకు మెడనొప్పి ఉన్నా సరే షూటింగ్‌కు డుమ్మా కొట్టకుండా సెట్‌కు వచ్చాడంటూ ఓ ఫోటో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ఇటీవల సినిమా నుంచి టీజర్‌, ట్రైలర్‌కు బదులుగా షో రీల్‌ అంటూ ఓ వీడియో రిలీజ్‌ చేయగా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా హరీష్‌.. ఎక్స్‌(ట్విటర్‌)లో రవితేజ ఫోటో షేర్‌ చేశాడు. 'ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకు తప్ప! కశ్మీర్‌ లోయలో షూటింగ్‌ బాగా జరిగింది. త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన రవితేజ.. 'ఓవర్‌ చేయకురోయ్‌.. నీ దిష్టే తగిలేలా' ఉంది అని ఫన్నీగా స్పందించాడు.

ఈ సినిమాలో హీరో.. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కు పెద్ద అభిమాని. అందుకు సంకేతంగానే టైటిల్‌ మిస్టర్‌ బచ్చన్‌ అని పెట్టారు. 2019లో హిందీలో వచ్చిన అజయ్‌ దేవ్‌గణ్‌ 'రైడ్‌' సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

 

 

చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్‌ సినిమా.. లూ మూవీ రివ్యూ

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)