దసరా బరిలో బాలయ్య, రవితేజ, రామ్‌.. బా​క్సాఫీస్‌ బద్దలే!

Published on Sat, 04/01/2023 - 10:16

పండగ సీజన్‌ అంటే సినీ ప్రేమికులకు సినిమా సందడి ఉండాల్సిందే. అందుకే పండగ టార్గెట్‌గా సినిమాలను రిలీజ్‌ చేస్తుంటారు. పండగకి ఐదారు నెలల ముందే రిలీజ్‌ డేట్‌ ప్రకటించి, పండగ బెర్త్‌ని కన్ఫార్మ్‌ చేసేస్తుంటారు. అలా ఈ దసరా పండక్కి బాక్సాఫీస్‌ పోటీ ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పటికి అధికారికంగా విడుదల తేదీ ప్రకటించి, బాక్సాఫీస్‌ బరిలో నిలవనున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 

 తెలంగాణ నేపథ్యంలో...
రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలు చాలానే వచ్చాయి. అయితే తాజాగా పూర్తి స్థాయి తెలంగాణ యాసతో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. శ్రీలీల ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకి  రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.  

ఓ గజదొంగ కథ 
రవితేజ నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్‌ కానుంది.   

మాస్‌ ఎనర్జీ 
రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ హై ఓల్టేజ్‌ మాస్‌ ఫిల్మ్‌ రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది. కాగా రామ్‌ కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ఇదే అన్న సంగతి తెలిసిందే. 

 మాఫియా డ్రామా 
‘మాస్టర్‌’ (2021) చిత్రం తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబరు 18న విడుదల కానుంది.   ప్రస్తుతానికైతే దసరా పండక్కి ఈ  సినిమాలు కర్చీఫ్‌ వేశాయి. మరి.. పండగ రేస్‌లో ఫైనల్‌గా ఏ సినిమాలు ఉంటాయనే విషయం రానున్న రోజుల్లో తెలుస్తుంది. 

అప్పుడు సంక్రాంతి..ఇప్పుడు దసరా
హీరోలు రవితేజ, రామ్, విజయ్‌లు నటించిన చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడటం ఇది తొలిసారి కాదు. 2021 సంక్రాంతికి రవితేజ ‘క్రాక్‌’, రామ్‌ ‘రెడ్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డాయి. ఇప్పుడు ఈ ముగ్గురి చిత్రాలు దసరా పోటీలో నిలి చాయి. ఈ మూడు సినిమాలతో పాటు ఇంకెన్ని సినిమాలు దసరా బరిలో నిలుస్తాయో చూడాలి.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)