Breaking News

రవితేజ థియేటర్‌ ప్రారంభం.. ఫస్ట్‌ సినిమా ఏదంటే..?

Published on Tue, 07/29/2025 - 08:56

మాస్‌మహారాజా రవితేజ థియేట‌ర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏషియన్‌ సినిమాస్‌ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో లగ్జరీ మల్టీఫ్లెక్స్‌ను ఆయన నిర్మించారు. ఇప్పటికే మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. తాజాగా రవితేజ్‌ కూడా ఆరు స్క్రీన్లతో వనస్థలిపురంలో మల్టీఫ్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. జులై 31న ప్రారంభోత్సవం జరగనుంది.

ART (ఏషియ‌న్ ర‌వితేజ) మల్టీఫ్లెక్స్‌లో తొలి సినిమా 'కింగ్డమ్‌' ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈస్ట్‌ హైదరాబాద్‌ ఏరియాలో అత్యంత లగ్జరీ థియేటర్‌గా ART నిలవనుంది. సుమారు 60 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్.. ఆపై డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో పాటు సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించే విధంగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.

రవితేజ థియేటర్‌లో 'కింగ్డమ్‌' తొలి సినిమా కావడంతో విజయ్‌ దేవరకొండ అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్‌లో భాగ్య శ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)