Breaking News

అ‍న్నాచెల్లెళ్ల ఎమోషనల్ డ్రామా.. రాజు గాని సవాల్ టీజర్ వచ్చేసింది!

Published on Wed, 07/09/2025 - 20:11

లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "రాజు గాని సవాల్". ఈ చిత్రాన్ని లెలిజాల కమల సమర్పణలో ఎల్‌ఆర్‌ ప్రొడక్షన్ బ్యానర్‌పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు జగపతి బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న విడుదల కానుంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ పాల్గొన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..' ఇది నాకు ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. బాపిరాజు నాకు చాలా దగ్గర వ్యక్తి. ఆయన ఏదైనా సినిమా తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. రాజు గాని సవాల్ సినిమాను ఆయన తీసుకున్నారంటే తప్పకుండా బాగుంటుంది. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ సినిమాలను మన ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అలాంటి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. ' అని అన్నారు.

హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. - రాజు గాని సవాల్ టీజర్‌ రిలీజ్ చేసిన జగపతి బాబుకు థ్యాంక్స్. మా మూవీ హైదరాబాద్ కల్చర్, తెలంగాణలో ఫ్యామిలీ బాండింగ్‌ చూపించేలా ఉంటుంది. బ్రదర్, సిస్టర్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది. అలాగే కుటుంబంలోని బంధాలు ఎలా ఉంటాయి. స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందని చూపించాం. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా సాగే క్లాసిక్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది.. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో సంధ్య రాథోడ్, రవీందర్ బొమ్మకంటి కీలక పాత్రల్లో నటించారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)