Breaking News

నటి మహాలక్ష్మి భర్త రవీందర్‌ అరెస్ట్‌

Published on Fri, 09/08/2023 - 11:36

కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాడు. గత ఏడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న రోజు నుంచి  ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నిర్మాత రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వారు రవీందర్‌ను అరెస్ట్‌ చేశారు.  ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్‌ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.

ది హిందూ ప్రకారం, ఘన వ్యర్థాల నుంచి ఒక ప్రాజెక్ట్ (విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా) పెట్టుబడి పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని ఆయన నమ్మపలికాడు. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని చేశాడు. అందుకు గాను అతని నుంచి రూ. 15.83 కోట్లు తీసుకున్నాడని సమాచారం. వారిద్దరి మధ్య ఈ ఒప్పందం సెప్టెంబర్ 17, 2020న జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ రవీందర్ మొదట చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడు.

(ఇదీ చదవండి; సీరియల్స్‌లో జగతినే.. అక్కడ మాత్రం తన ఫోటోలు వైరల్‌)

దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రశ్నంచగా రవీందర్‌ నుంచి సరైన సమాధానం లభించలేదని తెలుస్తోంది. దీంతో రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలాజీ  భావించారు. రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో బాలాజీ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు.

లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత  బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. రవీందర్ చంద్రశేఖరన్ ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో విజయ్‌ అనే తన స్నేహితుడి నుంచి రూ. 15 లక్షలు తీసుకుని, ఒక సినిమా నిర్మాణంలో భాగం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే కేసు కూడా రవీందర్‌పై ఉంది.

(ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్‌' కలెక్షన్స్‌.. ఆల్‌ రికార్డ్స్‌ క్లోజ్‌)

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)