Breaking News

నా కుమారుడి కెరీర్‌.. అక్కగా తనే చూసుకుంటుంది: రవితేజ

Published on Mon, 10/20/2025 - 09:38

టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే సినిమా పరిశ్రమలో నిలదొక్కున్నారు. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన పిల్లలు కుమారుడు మహాధన్‌, కుమార్తె మోక్షధ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రవితేజ ఈ విషయం గురించే మాట్లాడారు.

రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’.. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 31న విడుదల కానుంది.  ఈ క్రమంలోనే దర్శకుడు వెంకీ అట్లూరితో ప్రత్యేక చిట్‌చాట్‌లో రవితేజ పాల్గొన్నారు.  ఆ సమయంలోనే రవితేజ పిల్లల గురించి మాట్లాడారు. ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నానని రవితేజతో దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు. అయితే అదే మూవీకి మహాధన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని పంచుకున్నారు. 

వెంటనే రవితేజ కూడా "నా కుమారుడితో పని చేయడం ఎలా అనిపించింది..?" అని సరదాగా అడగ్గానే.. వెంకీ నవ్వుతూ.. 'అతను చిన్నప్పటి నుంచే సినిమా సెట్‌ల మధ్యే పెరిగాడు కాబట్టి  ఎలాంటి ఇబ్బంది లేదు.. చాలా నేచురల్‌గా అనిపించింది' అని పేర్కొన్నారు.  మహాధన్, చిన్నప్పుడు 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సూర్య సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు. రాబోయే రోజుల్లో మహాధన్‌ హీరోగా నటిస్తాడా.. దర్శకుడిగా పరిచయం కానున్నాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు.

కుమారుడి గురించి రవితేజ ఇలా చెప్పాడు.  మహాధన్‌ కెరీర్‌ గురించి అక్కగా మోక్షధ గ్గరగా గమనిస్తోంది. వాడు ఏ విషయం అయినా సరే వాళ్ల అక్కతోనే పంచుకుంటాడు. తను కూడా వాడికి అంతే ప్రాముఖ్యత ఇస్తుంది. వాడి కెరీర్‌ గురించి చూసుకునేందుకు మోక్షిధ ఉంది. అంటూ క్లారిటీ ఇచ్చారు. మోక్షధ కూడా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తుంది.  ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబినేషన్‌లో నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న 'తక్షకుడు' చిత్రానికి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో రవితేజ ప్రొడక్షన్ హౌస్ పేరుతో సినిమాలు కూడా ఆమె నిర్మించే ఛాన్స్‌ ఉంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)