Breaking News

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Published on Tue, 06/17/2025 - 00:11

హీరో రవితేజ, దర్శకుడు కిషోర్‌ తిరుమల కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం నుంచి ప్రారంభమైంది. ‘‘రవితేజ నటిస్తున్న 76వ చిత్రం ఇది. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం వేసిన సెట్‌లో చిత్రీకరణ మొదలైంది. రవితేజ, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్‌గా మేకోవర్‌ అయ్యారు. ఆయన ట్రేడ్‌మార్క్‌ కామిక్‌ టైమింగ్, మాస్‌ అప్పీల్‌తో కూడన పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా కథను ఈ సినిమా కోసం సిద్ధం చేశారు కిషోర్‌ తిరుమల. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. రవితేజ నటించిన ‘ధమాకా, మాస్‌ జాతర’ వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాకు కూడా భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్‌ జాతర’ ఆగస్టు 27న రిలీజ్‌ కానుంది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)