Breaking News

బిగ్‌ ప్లాన్‌తో రవితేజ కూతురు 'మోక్షద' .. ఎంట్రీకి లైన్‌ క్లియర్‌

Published on Thu, 04/10/2025 - 10:44

చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలామంది స్టార్‌ హీరోల వారసులు రాణిస్తున్నారు. కొందరు నటీనటులుగా మెప్పిస్తే.. మరికొందరు నిర్మాణ బాధ్యతల్లో ఉన్నారు. అయితే, ఇప్పుడు మాస్‌మహారాజ్‌ రవితేజ( Ravi Teja) ముద్దుల కూతురు మోక్షద(Mokshadha) ఎంట్రీకి లైన్‌ క్లియర్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి కొద్దిరోజుల క్రితమే సోషల్‌మీడియాలో ఒక వార్త వైరల్‌ అయింది. ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమె తెరమీద నటించేందుకు రావడం లేదని, తెర వెనుక కీలకంగా పోషించే పాత్రలో ఉండనున్నారని వారి సన్నిహితులు చెబుతున్న మాట.

సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు  ఇప్పుడు నిర్మాణ బాధ్యతలు నేర్చుకుంటోందని ఇండస్ట్రీలోని కొందరు చెబుతున్నారు. వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండతో(Anand Deverakonda) ఒక సినిమాను  సితార ఎంటర్ టైన్‌మెంట్స్(Sithara Entertainments) ప్లాన్‌ చేస్తుంది.  

ఈ సినిమాకు రవితేజ కూతురు మోక్షద  ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తోందట. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్‌ ఫైనల్‌ చేయలేదు. ఒక ప్రత్యేకమైన కథాంశంతో కూడిన యాక్షన్-థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది. మొదట అందరూ మోక్షద గురించి మాట్లాడుతూ.. హీరోయిన్‌ లేదా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ, ఆమె నిర్మాతగా భవిష్యత్‌లో కనిపించే ఛాన్స్‌ ఎక్కువ ఉంది.

నిర్మాతలుగా సత్తా చాటుతున్న హీరోల కూమార్తెలు
సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య మ్యాడ్‌ వంటి చిత్రాలను నిర్మించి రాణిస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు వంటి సినిమాతో నిర్మాతగా నిహారిక కొణిదెల సత్తా చాటింది.  సుస్మిత కొణిదెల నిర్మాతగా చిరంజీవి- అనిల్‌ రావిపూడితో ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆపై బాలకృష్ణ- బోయపాటి శ్రీను కొత్త సినిమా BB4కు నందమూరి తేజస్విని నిర్మాతగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరందరి సరసన రవితేజ ముద్దులు కూతురు మోక్షిద కూడా చేరనుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)