నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
క్రేజీ దర్శకుడితో 'రవితేజ' కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్ విడుదల
Published on Sun, 01/25/2026 - 11:00
రవితేజ- దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ మూవీపై (RT77) అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన రవితేజ.. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు. తాజాగా తన కొత్త సినిమాను . మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో ప్రకటించాడు. గతంలో నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శివ నిర్వాణ కాస్త రూట్ మార్చి ఓ థ్రిల్లర్ కథతో రానున్నాడు.

హైదరాబాద్‌లో టాకీ పార్ట్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 10గంటలకు రవితేజ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి 'ఇరుముడి' అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్.
ఈ సినిమా కోసం హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. సమంత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2026లో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Tags : 1