Breaking News

డబ్బు, పవర్‌ కాదు మూడో వ్యక్తి వల్లే విడిపోయాం: ఆర్తి రవి

Published on Tue, 05/20/2025 - 17:48

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్)(Ravi Mohan), ఆయన సతీమణి ఆర్తి రవి(Aarti Ravi) మధ్య విడాకుల వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.  2009లో వివాహం చేసుకున్న ఈ జంట, 18 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితం తర్వాత విడిపోతున్నట్లు గత ఏడాది జయం రవి ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై ఆర్తి తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనకు తెలియకుండానే, సంప్రదింపులు లేకుండా రవి ఏకపక్షంగా విడాకులు ప్రకటించారని సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఈ వివాదం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఆర్తి, జయం రవి తనను ఇంటి నుంచి తరిమేశారని, తమ ఇద్దరు కుమారుల బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా, ఆర్తి తనపై సానుభూతి కోసం పిల్లలను ఉపయోగించుకుంటోందని జయం రవి విమర్శించారు. తాజాగా, ఆర్తి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము విడిపోవడానికి డబ్బు లేదా పవర్‌ కారణం కాదని, మూడో వ్యక్తి (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో రవి సంబంధం) కారణమని ఆరోపించారు. ఈ విషయంపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఊహాగానం కాదని ఆర్తి స్పష్టం చేశారు.

కాగా ఇటీవల జయం రవి, కెనీషాతో కలిసి ఓ వివాహ వేడుకలో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిపై ఆర్తి భావోద్వేగంతో స్పందించారు. "18 ఏళ్లు నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈజీగా దూరమయ్యారు. పిల్లల బాధ్యత నా భుజాలపై ఉంది. నేను మాట్లాడకపోవడం నా నిజాయితీ కోసమే" అని ఆర్తి పేర్కొన్నారు. మరోవైపు, ఆర్తి తన సోషల్ మీడియా ఖాతాలను తన ఆధీనంలో ఉంచి ఇబ్బంది పెట్టిందని, ఆర్థికంగా, మానసికంగా వేధించిందని రవి ఆరోపించారు.

ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కూడా ఈ వివాదంలోకి దిగి, జయం రవిని కొడుకులా చూసుకున్నామని, అతని కోసం రూ.100 కోట్ల అప్పులు చేశామని, అయినా రవి అబద్ధాలు చెబుతున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది, కానీ ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి