Breaking News

'తండ్రి నుంచి చాలా నేర్చుకుంటున్నారు'.. జయం రవి భార్య ఎమోషనల్ పోస్ట్!

Published on Mon, 06/16/2025 - 19:15

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొద్దికాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తన భార్య ఆర్తితో విడాకులకు సిద్దమవడమే. గతేడాది సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత భార్య, భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు రావడంతో విడాకుల వ్యవహారం కాస్తా వివాదానికి దారితీసింది. అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి ఆరోపించింది. ప్రస్తుతం విడాకుల పంచాయతీ మాత్రం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

అయితే ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా జయం రవి భార్య ఆర్తి చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తన తండ్రి కృష్ణమూర్తి విజయ్‌కుమార్‌తో ఆమె కుమారులు సరదాగా ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది.  ఆయన తనకు ఎంత అండగా నిలిచారో నాకు మాత్రమే తెలుసన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించడన్ని తన పిల్లలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారని రాసుకొచ్చింది. తనను మొదట ప్రేమించిన వ్యక్తి తన తండ్రేనని ఆర్తి ఎమోషనల్‌ పోస్ట్ చేసింది.

ఆర్తి రవి తన తండ్రిన గురించి రాస్తూ.. 'తనను మొదట ప్రేమించిన వ్యక్తి నా తండ్రి. నన్ను మొదట ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ రోజు కొన్ని పదాలు వినడానికి మనసుకు చాలా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా. నా చుట్టూ చాలా అనిశ్చితిగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియని రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారు.. కానీ ఏమి చేయాలో మీరు అడగలేదు.  ప్రశాంతంగా, స్థిరంగా, బలంగా ఉన్నారు. తన తండ్రి ప్రేమను తాను తేలికగా తీసుకుంటున్నానని.. ‍అయితే తన పిల్లలు మాత్రం ఆయన ప్రేమను చూసి చాలా నేర్చుకుంటున్నారు. షరతులు లేకుండా ప్రేమించబడటం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే చాలు. మీరు నన్ను మాత్రమే కాదు.. నా పిల్లలను కూడా అలానే పెంచుతున్నారంటూ ' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

అంతేకాకుండా జీవితంలో తన అనుభవాలు తనను ఎలా మార్చాయో కూడా ఆర్తి ప్రస్తావించింది. జీవితంలో మళ్లీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు నేను మీ దృష్టిలో ఒకప్పుడు మీరు వదిలేసిన అమ్మాయిని కాదని నాకు తెలుసు. జీవితం నన్ను ఎవరూ ఊహించని విధంగా పరీక్షించింది. నేను వాగ్దానం చేస్తున్నా.. మళ్లీ మీ చిన్న అమ్మాయిగా తిరిగి వస్తా అంటూ పోస్ట్ చేసింది. కాగా.. దాదాపు 15 ఏళ్ల తర్వాత రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు.  ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు.
 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)