Breaking News

‘రేసుగుర్రం’ విలన్ చేతికి ఖరీదైన వాచ్.. ధర ఎంతో తెలుసా?

Published on Sun, 08/02/2026 - 08:51

తెలుగులో ‘రేసుగుర్రం’ సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఆయన ‘హర్ హర్ భోళే నమహ శివాయ’ అనే భక్తి గీతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో పాడుతున్న వీడియో ఒకటి నెట్టింట తీవ్రంగా వైరల్ అయ్యింది.  ఆయన భక్తి పారవశ్యానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా, ఆ వీడియోలో రవి కిషన్ చేతికి మెరుస్తున్న ఒక లగ్జరీ గడియారం ప్రతి ఒక్కరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.  

ఆ గడియారం ప్రత్యేకం ఏమిటంటే?
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం ప్రకారం రవి కిషన్ ధరించిన ఆ గడియారం ప్రముఖ స్విస్ లగ్జరీ వాచ్ బ్రాండ్ ‘హ్యూబ్లో’ (Hublot) కి చెందిన ‘బిగ్ బ్యాంగ్ మెకా-10’ మోడల్.  ఈ వాచ్ ఓపెన్-వర్క్డ్ (స్కెలిటన్) డయల్‌ను కలిగి ఉంటుంది. అంటే వాచ్ లోపల మెకానికల్ మూవ్‌మెంట్ ఎలా పనిచేస్తుందో బయటికే స్పష్టంగా కనిపిస్తుంది.   ఇది మాన్యువల్-వైండింగ్ వాచ్. ఒక్కసారి వైండింగ్ చేస్తే ఏకంగా 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. గ్లాస్‌పై కాంతి పడి పరావర్తనం చెందకుండా ఉండేలా యాంటీ-రెఫ్లెక్టివ్ ట్రీట్‌మెంట్‌తో కూడిన సఫైర్ క్రిస్టల్‌ను ఇందులో ఉపయోగించారు. 

ధర ఎంతంటే..
ఈ లగ్జరీ వాచ్ మార్కెట్ విలువ దాదాపు రూ. 35 లక్షలు ఉంటుందని అంచనా.  గతంలో కూడా రవి కిషన్ దాదాపు రూ. 2.7 కోట్ల విలువైన లగ్జరీ వాచ్‌తో కనిపించి వార్తల్లో నిలిచారు. తాజాగా మరోసారి రూ. 35 లక్షల ఖరీదైన గడియారంతో మెరవడంతో ఆయన వాచ్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)