Breaking News

చీర కట్టి, గాజులు వేసుకుని సీతలా నటించా.. నాన్న తోలు తీశాడు: నటుడు

Published on Sun, 12/29/2024 - 10:13

పిల్లలు బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం చేయాలని పేరెంట్స్‌ కలలు కంటుంటారు. తాము పడ్డ కష్టాలు వారు పడకూడదని ఆలోచిస్తారు. అయితే ఉద్యోగం చేయడం అందరికీ ఇష్టం ఉండదు. కొందరికి తెలియకుండానే నటనవైపు మనసు మళ్లుతుంది. అలా నటుడు, రాజకీయ నాయకుడు రవి కిషన్‌ కూడా చిన్నతనంలోనే యాక్టింగ్‌పై మనసు పారేసుకున్నాడు. కానీ ఇది అతడి తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకసారైతే అతడిని విపరీతంగా కొట్టి చర్మం ఒలిచేశాడు.

చర్మం ఊడిపోయేలా కొట్టాడు
ఈ సంఘటన గురించి రవి కిషన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా ఊరిలో రామ్‌లీలా అనే నాటకం వేసేవారు. నేను అందులో సీతలా నటించేవాడిని. ఒకరోజు మా నాన్నకు ఆ విషయం తెలిసింది. అప్పుడు నేను మా అమ్మ చీర తీసుకెళ్లి దానితో రోజంతా రిహార్సల్‌ చేశాను. ఇంటికి వెళ్లగానే మా నాన్న బెల్ట్‌ అందుకుని వాయించాడు. నా చర్మం ఊడిపోయేలా కొట్టాడు. మా ఊరిలో నాన్నకు మంచి పేరుంది. తనకు అందరూ ఎంతో గౌరవించేవారు. బహుశా అందుకునేమో నేనిలా అమ్మాయిలా వేషం కట్టి యాక్ట్‌ చేస్తుంటే భరించలేకపోయారు.

ఆ రోజే ఇంటి నుంచి పారిపోయా
అయితే ఆ కోపంతో నాన్న నన్నెక్కడ చంపేస్తాడోనని అమ్మ భయపడింది. అదే రోజు రాత్రి నా చేతిలో రూ.500 పెట్టి పారిపోమని చెప్పింది. అలా 15 ఏళ్ల వయసులో నేను ఇంటి నుంచి పారిపోయి ముంబైకు వచ్చాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రవికిషన్‌ హిందీ, భోజ్‌పురి, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు. రేసుగుర్రం మూవీతో తెలుగువారికి ఎంతగానో దగ్గరైన ఈయన ప్రస్తుతం డాకు మహారాజ్‌ మూవీ చేస్తున్నాడు.

చదవండి: ఈ ఏడాదిలో 'జాతర' చూపించిన స్టార్స్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)