Breaking News

పెద్ద స్టార్‌నన్న గర్వంతో కండీషన్స్‌ పెట్టా.. చివరకు గుణపాఠం చెప్పారు!

Published on Sat, 04/01/2023 - 17:58

ఒక్కసారి స్టార్‌డమ్‌ను తలకెక్కించుకుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎలాగో స్టార్‌ను అయ్యాను కదా అని గొంతెమ్మ కోర్కెలు కోరితే మొదటికే మోసం వస్తుంది. అందుకు ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్‌ ప్రత్యక్ష ఉదాహరణ. స్టార్‌డమ్‌తో గర్వాన్ని తలకెక్కించుకోవద్దని ఓ సంఘటన తనకు గుణపాఠం చెప్పిందంటున్నాడు రవి కిషన్‌.

తాజాగా ఓ షోలో ఆయన మాట్లాడుతూ.. 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నేనేమో పెద్ద స్టార్‌నన్న గర్వంతో.. రోజూ పాలతో స్నానం చేస్తా, గులాబీ పూల రెక్కలపై నిద్రిస్తా.. అవన్నీ మీరే ఏర్పాటు చేయాలని చెప్పాను. ఎందుకంటే నేను స్టార్‌ను, ఇలాంటివి మినిమమ్‌ ఉండాలి కదా అన్న భ్రమలో ఉన్నాను. అప్పుడు జనాలు నా గురించి మాట్లాడుకుంటారని ఊహించాను. కానీ నేను అనుకుంది ఒకటైతే జరిగింది మరొకటి. నన్ను గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌లో తీసుకోలేదు. నాకోసం రోజూ 25 లీటర్ల పాలు ఏర్పాటు చేయడం అసాధ్యమన్నారు.

నా డిమాండ్లు నాకే హాని తలపెట్టాయి. కాబట్టి అప్పటినుంచి అలాంటి డిమాండ్లు చేయడం మానేశాను. ఏమీ లేని స్థాయి నుంచి వచ్చినప్పుడు సడన్‌గా డబ్బు, పేరుప్రతిష్టలు వచ్చినప్పుడు మనసును నియంత్రించడం చాలా కష్టం. ముంబైలాంటి నగరం ఎవరినైనా పిచ్చోళ్లను చేస్తుంది. అందులో నేనూ ఒకడిని. అందుకే నేను నాపై నియంత్రణ కోల్పోయాను' అని చెప్పుకొచ్చాడు. కాగా రవి కిషన్‌.. భోజ్‌పురి ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు రేసుగుర్రం విలన్‌గానే ఎక్కువ గుర్తుండిపోయాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)