Breaking News

రవి కిషన్‌కు ఊరట.. ఆ పరీక్షకు కోర్టు నిరాకరణ

Published on Fri, 04/26/2024 - 19:16

లోక్ సభ ఎన్నికల సమయంలో నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌కు కాస్త ఊరట లభించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రవికిషన్‌ తన అండ్రి అంటూ జూనియర్‌ నటి షినోవా సోనీ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె ముంమై కోర్టును ఆశ్రయించింది.

భోజ్ పురి, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్.. అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో గోరఖ్ పుర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన మరొసారి ఎన్నికల బరిలో ఉన్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో రవి కిషన్‌ తన భర్త అంటూ కొద్ది రోజుల క్రితం షినోవా సోనీ తల్లి అపర్ణా సోనీ  విలేకరుల సమావేశంలో ప్రకటించింది. 


(రవి కిషన్‌ సతీమణి ప్రీతి)

రవికిషన్‌ నుంచి సరైన రెస్పాన్స్‌ రాకపోవడంతో షినోవా సోనీ తన తల్లితో కోర్టుకు వెళ్లింది. డీఎన్‌ఏ పరీక్ష చేయాలని తన లాయర్‌ ద్వారా పిటీషన్‌ దాఖలు చేసింది. రవికిషన్‌ను తాను అంకులు అని పిలుస్తాను. కానీ, ఆయన తనకు తండ్రి అని ఆమె చెప్పింది. ఆమె మాటల్లో నిజం లేదని రవికిషన్‌ లాయర్‌ చెప్పారు. అపర్ణతో రవికిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. వారిద్దరి మంచి స్నేహ బంధం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఎలాంటి రిలేషన్‌ కూడా లేదన్నారు. అపర్ణ, రవికిషన్‌ రిలేషన్‌లో ఉన్నారని చెప్పేందుకు కనీసం ఒక్క ఆధారం అయినా చూపించకపోవడంతో డీఎన్‌ఏ పరీక్షను కోర్టు తిరస్కరించింది. గతంలో తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు రవికిషన్‌ సతీమణి తెలిపారు. ఒకవేళ డబ్బు ఇవ్వకుంటే అత్యాచారం కేసులో రవికిషన్‌ను ఇరికిస్తామంటూ షినోవా సోనీ, అపర్ణ బెదిరించారని ఆమె తెలిపింది.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)