Breaking News

డ్రెస్సుపై ఒక్క చిరుగూ లేకుండా అలాంటి సీన్‌లో నటించా: హీరోయిన్‌

Published on Tue, 02/07/2023 - 11:32

రవీనా టాండన్‌..  90వ దశకంలో బాలీవుడ్‌లో స్టార్‌ హీయిన్‌గా రాణించిన వారిలో ఆమె ఒకరు. అప్పట్లో తెరపై ఈ పేరు కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయేవారు. తూ ఛీజ్ బడి హై మస్త్ మస్త్ అంటూ ‘మొహ్రా’ సినిమాలో  ఆమె వేసిన స్టెప్పులో ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆమె అందానికి బాలీవుడ్‌ ఫియా అయింది. వరుస సినిమాలతో అదరగొట్టేసింది. కానీ ఒకనొక దశలో ఆమెపై  అహంకారి అనే ముద్రపడింది. దర్శక నిర్మాత మాట వినదనే అపవాదు ఆమెపై పడింది. ఫలితంగా కొన్ని సినిమాలు ఆమె చేతి నుంచి జారిపోయాయి.

తాజాగా ఈ విషయాలపై రవినా టాండన్‌ ఓ  జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు అంగీకరించకపోవడంతో తనపై అహంకారి అనే ముద్ర వేశారని చెప్పారు. ‘కొన్ని విషయాల్లో నేను అసౌకర్యంగా ఉండేదాన్ని. స్విమింగ్‌ డ్రెస్‌ ధరించడం నాకు నచ్చదు. అలాగే ముద్దు సన్నివేశాలు కూడా చేయలాని ఉండేది కాదు. సినిమా ఒప్పందానికి ముందే నేను ఈ కండీషన్‌ పెట్టేదాన్ని. అందుకే నాపై అహంకారి అనే ముద్ర వేశారు. సినిమా అవకాశాలు రాకపోయినా కూడా.. నేను అలాంటి సీన్స్‌ చేయలేదు.

రెండు రేప్‌ సీన్స్‌లో నటించినప్పటికీ.. ఎలాంటి అసభ్యతకు తావివ్వకుండా జాగ్రత్త తీసుకున్నా. డ్రెస్సుపై ఒక్క చిరుగూ కూడా లేకుండా రేప్‌ సీన్స్‌లో నటించిన ఏకైక నటిని నేనే. అలాంటి సీన్స్‌ ఉన్నాయని చాలా సినిమాలు వదులుకున్నాను. ‘డర్‌’ సినిమా అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని సన్నివేశాలు అసౌకర్యంగా అనిపించాయి. స్విమ్మింగ్‌ కాస్ట్యూమ్స్‌ ధరించనని దర్శక,నిర్మాతలకు చెప్పేశా. ప్రేమ్‌ ఖైదీ చిత్రాన్ని కూడా అలానే వదిలేశా’అని రవినా టాండర్‌ చెప్పుకొచ్చారు. తెలుగులో బాల‌య్య ‘బంగారు బుల్లోడు’, వినోద్‌కుమార్ ‘ర‌థ‌సార‌థి’, నాగార్జున ‘ఆకాశ‌వీథిలో’ సినిమాలలో రవీనా నటించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)