Breaking News

మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్‌: టాప్‌ హీరోయిన్‌

Published on Sun, 09/10/2023 - 11:52

ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపిన వాన పాట ‘టిప్‌ టిప్ బర్సా పానీ’. 1994లో విడుదలైన 'మోహ్రా' చిత్రం కోసం అక్షయ్ కుమార్‌తో కలిసి రవీనా టాండన్ దుమ్ములేపారు. ఈ ఐకానిక్ పాట చిత్రీకరించడం గురించి ఆమె తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

(ఇదీ చదవండి: రాఘ‌వేంద్ర‌ రావు చెంప చెళ్లుమ‌నేలా కౌంట‌ర్లు ఇస్తున్న నెటిజన్లు)

నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేయడంతో చాలా ఇబ్బంది పడినట్లు రవీనా చెప్పుకొచ్చింది. అక్కడ  చుట్టూ ఇనుప చువ్వలతో పాటు అపరిశుభ్రంగా ఉంది. దీంతో పాట చిత్రీకరణలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు రవీనా తెలిపింది. అంతేకాకుండా  చెప్పులేకుండా చీర ధరించి వర్షంలో అలాంటి మూమెంట్స్‌ చేయడం చాలా కష్టమనిపించినట్లు చెప్పింది. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడు ఆ బాధను భరిచలేకపోయానని తెలిపింది. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.

(ఇదీ చదవండి: భక్త కన్నప్పలో ప్రభాస్‌.. అదిరిపోయే అప్‌డేట్‌)

ఆ పాట దెబ్బతో సుమారు  మూడు రోజులకు పైగానే అనారోగ్యానికి గురికావడం జరిగిందని గుర్తుచేసుకుంది. తెరపై ప్రేక్షకులు చూసే గ్లామర్... తెరవెనుక చెప్పలేనన్ని కథలను దాచిపెడుతుంది. రిహార్సల్స్ సమయంలో గాయాలు మామూలే, అయినా తామందరం వాటిని సహిస్తామని తెలిపింది. పాట చిత్రీకరణ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినా అదీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో ఆ బాధలన్నీ మరిచిపోయామని రవీనా టాండన్‌ చెప్పింది. ఇదే పాటను 2021లో విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాలో కూడా రీమేక్‌ చేశారు. అందులో అక్షయ్‌కుమార్‌ - కత్రినాకైఫ్‌ నటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)