Breaking News

'ఎప్పటికీ నయం కానీ గాయం'.. ఎయిరిండియా సిబ్బందిపై నటి ప్రశంసలు!

Published on Mon, 06/16/2025 - 17:24

అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారి ఎయిరిండియా ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ విషాదం తర్వాత కూడా ప్రయాణికుల కోసం చిరునవ్వుతో పలకరిస్తున్న ఎయిరిండియా క్యాబిన్‌ సిబ్బందిపై ఆమె ప్రశంసలు కురిపించారు. విమాన ప్రమాదం తర్వాత సిబ్బంది, ప్రయాణీకులలో నెలకొన్న భయం, మానసిక స్థితి గురించి ప్రస్తావించింది.

రవీనా ఇన్‌స్టాలో రాస్తూ.. 'కొన్ని ప్రారంభాలు అన్ని అడ్డంకులను తట్టుకుని నిలవాలి. ప్రస్తుతం ఎయిరిండియా సిబ్బంది బాధలో ఉన్నప్పటికీ కొత్త సంకల్పం కోసం చిరునవ్వులతో ప్రయాణికులను స్వాగతిస్తున్నారు.  ప్రయాణీకులు, సిబ్బంది మధ్య ఏదో తెలియని బంధం ఏర్పరుచుకున్నారు. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం. ఇది ఎప్పటికీ నయం కాని గాయం. కానీ ఎయిరిండియా ఎల్లప్పుడూ ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ బలంగా నిలబడాలనేదే వారి సంకల్పం' అంటూ ఫ్లైట్‌లో తాను దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. బాధలోనూ తమ సంస్థ కోసం సిబ్బంది కష్టపడుతున్న తీరుపై రవీనా టాండన్ ప్రశంసలు కురిపించారు. కాగా.. జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే. 
 

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)