Breaking News

Ravanasura Movie: ‘రావణాసుర’ట్విటర్‌ రివ్యూ

Published on Fri, 04/07/2023 - 06:44

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’.సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌ హీరోయిన్స్‌గా న‌టించారు. యంగ్‌ హీరో సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఇప్పుటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి.

భారీ అంచనాలతో నేడు(ఏప్రిల్‌ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రావణాసుర’ కథేంటి? ఎలా ఉంది?  రవితేజ ఖాతాలో మరో హిట్‌ పడిందా? తదితర విషయాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

‘రావణాసుర’ఫుల్‌ మసాల థ్రిల్లర్‌ మూవీ. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు జనరల్‌ ఆడియన్స్‌కి కూడా అలరిస్తుంది. రవితేజను గతంలో ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో చూస్తాం. స్టోరీ, ఇంటర్వెల్‌ సీన్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుందంటూ ఓ నెటిజన్‌ 4 స్టార్స్‌ ఇచ్చారు. 

సెకండాఫ్‌లో మంచి ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్‌, బీజీఎం బాగుంది. లాయర్‌ క్రిమినల్‌ అయితే ఎలా ఉంటుందో మన మాస్‌ మహారాజా చూపించాడు. ఓవరాల్‌గా సినిమా హిట్‌ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

ఫస్ట్ హాఫ్ డీసెంట్‌. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ సూపర్. హీరోయిన్స్ రోల్స్ ఇంప్రెసివ్ గా లేవు. కానీ రవన్న(రవితేజ) యాక్టింగ్‌ అదిరిపోయింది. ఓవరాల్‌గా సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటూ మూడున్నర స్టార్‌ ఇచ్చాడు ఓ నెటిజన్‌. 

రవితేజ అన్న ప్లీజ్‌ ఇలాంటి సినిమాలు చేయకు. నిప్పు, ఖిలాడీ చూసిన ఫీలింగ్‌ కలుగుతోంది. దీని కంటే ఖిలాడీ బెటర్‌. నీకు ఫెయిల్యూర్‌ రావాలని ఎవరూ అనుకోరు. కానీ నువ్వు మాత్రం డిజాస్టర్స్‌ తీస్తున్నావు అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)