Breaking News

'రష్మిక'కు రక్షణ కల్పించాలంటూ అమిత్ షాకు 'కుల' పెద్దల లేఖ

Published on Mon, 03/10/2025 - 11:28

పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ 'రష్మిక మందన్న'కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి (కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈమేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్‌గా 'ఛావా' సినిమా సక్సెస్‌ మీట్‌లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్‌ మీడియాతో  ఆమె మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్‌ నుంచి వచ్చాను.. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.' అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్‌ అయ్యారు.

రష్మికకు రక్షణగా 'కుల' పెద్దలు
సౌత్‌ ఇండియాతో పాటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్న  రష్మికకు  భద్రత కల్పించాలని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్‌లకు 'కొడవ నేషనల్ కౌన్సిల్' (సీఎన్‌సీ) లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని (సీఎన్‌సీ) పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని 'కొడవ' బోర్డు కోరింది.  తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్.యు. నాచప్ప లేఖలో పేర్కొన్నారు.  

దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న  అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తుచేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ, ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిని వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం 'కొడవ' అని తెలిసిందే.

ఎమ్మెల్యే బెదిరింపులు
రష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 'రవి గనిగ' ఫైర్‌ అయ్యారు. బాలీవుడ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడతూ ఆయన ఒక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు.  

ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్‌ ఒక లేఖ రాశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)