Breaking News

అవును..నా యాస ఇలానే ఉంటుంది : ట్రోలింగ్‌పై రష్మిక స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Thu, 10/22/2026 - 11:58

పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు. అలాగే సినీ తారల్లో తప్పులే వెతికేవారికి వాళ్లు చేసే ప్రతి పనిలోనూ నెగెటివిటీనే కనిపిస్తుంది. చిన్న విషయాన్ని సైతం పెద్దది చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతుంటారు. అలా రష్మిక విషయంలోనూ జరుగుతోంది. ఆమె యాసను హేళన చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతుందని హేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

తాజాగా ఈ ట్రోలింగ్‌పై రష్మిక స్పందించింది. తను దక్షిణాది నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి..సహజంగానే తనలో ఆ యాస ఉంటుందని చెప్పింది. తాజాగా భర్త విజయ్‌ దేవరకొండతో కలిసి ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్‌ షోలో పాల్గొన్న ఆమె.. తన యాసపై వచ్చిన ట్రోల్‌  గురించి మాట్లాడుతూ.. ‘ఇలాంటి విమర్శలను తాను ఎన్నో చూశానని.. వాటి కారణంగా తనను తాను ఎప్పుడూ హద్దులు విధించుకోవాలని ఆలోచించలేదని చెప్పింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగితే.. అప్పుడు ఓకే చేశా: విజయ్‌ దేవరకొండ)

‘నేను సౌత్‌ యాసలో మాట్లాడుతున్నానని ట్రోల్‌ చేస్తున్నారు. అది నిజమే.. నేను దక్షిణాది నుంచి వచ్చాను. అందుకే నాలో ఆ యాస సహజంగానే ఉంటుంది. అలా కాకుండా మరోలా మాట్లాడాలనుకోవడం సమంజసం కాదు. ఇలాంటి ట్రోల్‌ నాకు కొత్తేమి కాదు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా నన్ను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. నా మాట, నటన, యాస..ఇలా దేనిని వదలడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. వారి కోసం నాకొచ్చిన అవకాశాలను మిస్‌ చేసుకోవాలనుకోలేదు’ అని రష్మిక అన్నారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)