Breaking News

డీప్‌ ఫేక్‌ వీడియోకు మించి యానిమల్‌లో రష్మిక కనిపించిందా..?

Published on Sun, 12/03/2023 - 08:08

సినిమా పరిశ్రమకు చెందిన పలువురి హీరోయిన్ల డీప్‌ ఫేక్‌ వీడియోలు అందరినీ తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. మొదట రష్మిక మందన్న ఆ తర్వాత  కాజోల్, అలియా భట్‌లు ఈ భూతానికి గురి కావడం జరిగింది. ఈ వీడియోపై రష్మిక మందన్న కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, నాగ చైతన్య సహా పలువురు నటీనటులు ఇలాంటి ఘటనను ఖండించారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. యానిమల్‌ సినిమాతో రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో టాపిక్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. దానికి కారణం యానిమల్ సినిమాలోని రష్మిక మందన్న హాట్ సీన్స్ అని చెప్పవచ్చు.

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'యానిమల్' డిసెంబర్ 1న దేశవ్యాప్తంగా విడుదలైంది. ఇది తండ్రీ కొడుకుల మధ్య సాగే కథ. అయితే సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య హాట్ హాట్ సీన్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నల మధ్య ముద్దుల సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. తండ్రీకొడుకుల సినిమా అయినప్పటికీ ఇందులో ఘాటైన ప్రేమకథ ఉందని నెటిజన్లు తెలుపుతున్నారు. 

ఈ సినిమాలో రష్మిక మందన్న రణబీర్ కపూర్ భార్య గీతాంజలి పాత్రలో నటిస్తుంది. వీరిద్దరి మధ్య సన్నిహిత సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, క్లిప్‌లు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాకు అడల్ట్స్ ఓన్లీ (ఏ) సర్టిఫికేట్ ఇవ్వడం సరైనదేనని పలువురు దుయ్యబట్టారు.

డీప్‌ఫేక్ వీడియో టాపిక్‌ మళ్లీ 
యానిమల్‌ సినిమాలోని రష్మిక హాట్‌ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మిక మందన్నను ట్రోల్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం డీప్‌ఫేక్ వీడియోతో బాధపడి ఏడ్చింది రష్మికనేనా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోకు మించి ఎక్కువ మోతాదులోనే హాట్‌గా కనిపించిందని వారు తెలుపుతున్నారు. రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో ఎందుకు చూడటం.. యానిమల్‌ సినిమాకు వెళ్లి చూడండి అంటూ వ్యంగ్యంగా తెలుపుతున్నారు. స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడంలో లేని బాధ డీప్‌ ఫేక్‌ వీడియోల వల్ల ఇబ్బంది వచ్చిందా అంటూ ఆమెపై విమర్శలకు దిగుతున్నారు.

కానీ ఈ విషయంలో రష్మికకు కూడా కొందరు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదొక సినిమా అని మరిచిపోవద్దు. కథలో భాగంగా మాత్రమే ఆమె అలా నటించింది. అందుకు గట్స్‌ ఉండాలి. ఇలాంటి చెత్త కామెంట్లు చేయడం ఆపేయండని తెలుపుతున్నారు. ఆమెను అసభ్యంగా డీప్‌ ఫేక్‌ వీడియోలు చూపించారని కామెంట్‌ చేయలేదు.. టెక్నాలజీని ఇలాంటి పనులకు ఉపయోగించడం ఏంటని తప్పుబట్టింది. టెక్నాలజీ సాయంతో సామాన్యమైన యువతులతో పాటు  సెలబ్రిటీలపై కూడా ఇంతకు మించిన వీడియోలు క్రియేట్‌ చేసి వైరల్‌ చేసే అవకాశం ఉందని పరోక్షంగా ఆమె తెలిపింది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?