Breaking News

కొత్త కాంబినేషన్‌?

Published on Sun, 07/26/2026 - 00:55

ఓ వైపు కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్‌గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు రష్మిక మందన్నా. మరోవైపు ఇటు సినిమాలు అటు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో  తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు రాజ్‌ నిడిమోరు (రాజ్‌), కృష్ణ దాసరి (డీకే). వీరిద్దరూ తాజాగా రష్మిక కోసం ఓ పవర్‌ఫుల్‌ కథని సిద్ధం చేస్తున్నారట. కాగా ఇటీవలే రాజ్‌ నిడిమోరు అందించిన కథతో సమంత లీడ్‌ రోల్‌లో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో పాటు రూ. 100 కోట్లు వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

అందం, అభినయంతో పాన్‌ ఇండియా స్థాయిలో తనకంటూ అభిమానులను సం పాదించుకున్న రష్మికతో ఇప్పుడు ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారట రాజ్‌ అండ్‌ డీకే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథా చర్చలు ఆరంభంలో ఉన్నాయని సమాచారం. రష్మిక ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేసిన తర్వాత ఆమెను కలిసి వినిపించనున్నారట రాజ్‌–డీకే. మరి... వార్తల్లో ఉన్నట్లు ఈ కొత్త కాంబినేషన్‌ కుదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)